హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 14 (నమస్తే తెలంగాణ): కార్నెజియా మిల్ల న్ యూనివర్సిటీ (సీఎంయూ-యూఎస్ఏ)లో జాయింట్ ఎంబీఏ కోర్సులో ప్రవేశాలకు ఈ నెల 16న కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్టు జేఎన్టీయూ అధికారులు వెల్లడించారు.
అర్హత, ఆసక్తి ఉన్నవారు ఎస్సెస్సీ, ఇంటర్, డిగ్రీ లేదా తత్సమాన సర్టిఫికెట్లు, టీసీతో హాజరుకావాలని సూచించారు. కౌన్సెలింగ్ ఫీజు రూ.2 వేలు నిర్ణయించామని, ప్రతి సెమిస్టర్‌కు రూ.90 వేల చొప్పున ఫీజు చెల్లించాలని తెలిపారు.