వ్యవసాయ యూనివర్సిటీ, నవంబర్ 21: వ్యవసాయ, అనుబంధ రంగాల విద్యలో సీట్ల భర్తీకి సోమవారం నుంచి తొలి విడత కౌన్సెలింగ్ చేపట్టినట్టు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ డాక్టర్ సుధీర్‌కుమార్ తెలిపారు. పీజేటీఎస్ఏయూ, పీవీఎన్ఆర్టీవీయూ, ఎస్‌కేఎల్‌టీఎస్‌హెచ్‌యూలో వివిధ యూజీ కోర్సులకు అర్హత సాధించిన వారికి సోమవారం ఆడిటోరియంలో కౌన్సెలింగ్ నిర్వహించారు. వెటర్నరీ వర్సిటీ రిజిస్ట్రార్ వీరోజీరావు, వ్యవసాయ వర్సిటీ డీన్ సీమ, పరీక్షల నియంత్రణాధికారి శ్రవణ్‌కుమార్ తదితరుల ఆధ్వర్యంలో జరిగిన కౌన్సెలింగ్‌లో తెలంగాణ ఎంసెట్‌లో (2022) 209 ర్యాంకు పొందిన వర్షిత, 333 ర్యాంకర్ సృజన, 348 ర్యాంకర్ హరిణికి సీట్లు కేటాయించారు. సీట్ల భర్తీ వివరాల కోసం www.pjtsau.in ను చూడవచ్చు.