కౌలు రైతు ఆత్మహత్య.. అకాల వర్షాలకు దెబ్బతిన్న పత్తి
కాంగ్రెస్ సర్కారు పాలనలో రైతుల ఆత్మహత్యలు ఆగడం లేదు. ఈ క్రమంలో ఆర్థిక ఇబ్బందులతో కౌలు రైతు ఆ త్మహత్యకు పాల్పడిన ఘటన జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం ఆంధ్రతండాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
- పదిలక్షల అప్పుతీర్చే దారిలేక బలవన్మరణం
- జనగామ జిల్లా ఆంధ్రతండాలో ఘటన
రఘునాథపల్లి, నవంబర్ 29 : కాంగ్రెస్ సర్కారు పాలనలో రైతుల ఆత్మహత్యలు ఆగడం లేదు. ఈ క్రమంలో ఆర్థిక ఇబ్బందులతో కౌలు రైతు ఆ త్మహత్యకు పాల్పడిన ఘటన జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం ఆంధ్రతండాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆంధ్రతండాకు చెందిన మాలోత్ రమేశ్(39)కు తొమ్మిది గుంటల వ్యవసాయ భూమి ఉంది. నర్మెట మండల కేంద్రానికి చెందిన మత్త రవి వద్ద నాలుగు ఎకరాల భూమిని కౌలుకు తీసుకొని పత్తి సాగు చేశాడు. ఇటీవల అకాల వర్షాలతో పత్తి పంట దెబ్బతిన్నది.
దిగుబడి రాకపోవడంతో పెట్టుబడికి చేసిన అప్పు రూ.10 లక్షలు ఎలా తీర్చాలో తెలియక రమేశ్ ఆవేదనకు గురయ్యాడు. మరోవైపు ఆరోగ్యం సహకరించకపోవడంతో శనివారం పురుగుల మందుతాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బాధితుడిని జనగామలోని దవాఖానకు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై దూదిమెట్ల నరేశ్‌యాదవ్ తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
RRR | రీజినల్ రింగ్ రోడ్ ఉత్తర భాగానికి కేంద్రం బ్రేక్.. ప్రస్తుత అలైన్మెంట్తో ప్రాజెక్టుకు ఆమోదం కష్టమే!
Congenital Birth: ఒడిశాలో రెండు తలలతో పుట్టిన మగ శిశువు
Mithun Chakraborty | ‘జైలర్ 2’లో రజనీకాంత్‌కు మిథున్ చక్రవర్తి కండీషన్.. విలన్ పాత్రకు ఓకే చెప్పడానికి అదే కారణమా?
Raja Saab | ‘రాజా సాబ్’ ఫ్లాప్‌కు అదే ప్రధాన కారణం.. తొలిసారి అసలు విషయం చెప్పిన నిర్మాత టీజీ విశ్వప్రసాద్!
Pope Leo XIV: పోప్ లియోకు ఊపిరితిత్తుల క్యాన్సర్.. సర్జరీతో కణితి తొలగింపు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

