శంషాబాద్ రూరల్, మే 20 : ఇంటి నిర్మాణానికి కావాల్సిన అనుమతులు ఇచ్చేందుకు లంచం తీసుకుంటుండగా పంచాయతీ కార్యదర్శి, బిల్ కలెక్టర్‌ను ఏసీబీ అధికారులు సోమవారం రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఏసీబీ డీఎస్పీ ఆనంద్‌కుమార్ తెలిపిన వివరాల ప్రకారం హైదరాబాద్‌కు చెందిన బర్కత్ అలీకి శంషాబాద్ మండలంలోని నానాజీపూర్ గ్రామ పంచాయతీ పరిధిలో 500 గజాల స్థలం ఉంది.
ఆ స్థలంలో ఇంటి నిర్మాణంతో పాటు ప్రహరీ, ఇంటి నెంబర్ అనుమతుల కోసం నానాజీపూర్ పంచాయతీ కార్యదర్శి రాధికను కలవగా, ఆమె రూ.60వేలు లంచం డిమాండ్ చేసింది. చివరికి రూ.35వేలకు ఒప్పందం చేసుకున్న బర్కత్ అలీ ఏసీబీని ఆశ్రయించాడు. ఈ క్రమంలో సోమవారం పంచాయతీ కార్యాలయంలో బాధితుడి నుంచి రూ.35వేలు తీసుకుంటుండగా పంచాయతీ కార్యదర్శి రాధిక, బిల్‌కలెక్టర్ బాల్‌రాజ్‌ను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని రిమాండ్‌కు తరలించినట్టు ఏసీబీ డీఎస్పీ ఆనంద్‌కుమార్ తెలిపారు.