మహారాష్ట్ర నుంచొస్తున్న ఓ లారీ డ్రైవర్, ఆ రాష్ట్ర సరిహద్దులోని ఓ చాయ్కొట్టు యజమాని మధ్య సంభాషణ..
డ్రైవర్ : బాబాయ్ ఓ చాయ్ ఇవ్వు..
చాయ్‌వాలా : చాలా దూరం నుంచి అస్తున్నట్టున్నవ్.. బాగా అలసిపోయినవ్..
డ్రైవర్ : దూరమా పాడా.. జస్ట్ 5కి.మీటర్లే గీ రోడ్డు పొంటి అచ్చిన.. ఎంత అలసిపోయిన్నో సూడు.
చాయ్‌వాలా : అయితాయె గానీ చాయ్ ఎట్లుందో సెప్పకపోతివి..
డ్రైవర్ : మంచిగనే ఉందిగని.. ఈన్నుంచి తెలంగాణ ఇంకెంత దూరం బోవాలే..
చాయ్‌వాలా : ఈ గతుకుల రోడ్డు అయిపోయి యాడైతే రోడ్డు నున్నగొస్తదో ‘గాన్నుంచే తెలంగాణ’ పో.. మళ్లొచ్చేటప్పుడు అక్కడి సంగతులు సూసి నా సెవినేసిపో..
డ్రైవర్ : సరే బాబాయ్..
తిరుగు ప్రయాణంలో..
చాయ్‌వాలా : కాకా అచ్చినవా కూసో.. ఇగో చాయ్ దీస్కో.. ఎట్లుంది మరి తెలంగాణ..
డ్రైవర్ : ఏం జెప్పాలే.. ఒకటా రెండా.. అక్కడ ఎవల్ని పలకరించినా ‘జై కేసీఆర్’ అంటున్నరు..
చాయ్‌వాలా : అగో.. అక్కడ గంత మంచిగుందా పనితనం
డ్రైవర్ : ఒక్క మాటలో జెప్పాలంటే సూపర్ బాబాయ్.. ఇగ నేను లారీని గటే నడుపుకుంటా.. ఇటు రాను.. అనుకుంటూ పయనమయ్యాడు డ్రైవర్.
– సురేందర్ బండారు