రవీంద్రభారతి, సెప్టెంబర్ 1: పీఈటీ పోస్టులను కాంట్రాక్టు విధానంలో నియమించడాన్ని విరమించుకోవాలని, ప్రత్యేక డీఎస్సీ ద్వారానే భర్తీ చేస్తామని ప్రకటించాలని టీయూపీఈటీఏ అధ్యక్షుడు మాదగోని సైదులుగౌడ్ డిమాండ్ చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లోపు ప్రభుత్వం స్పందించకుంటే ఫిజికల్ ఎడ్యుకేషన్ నిరుద్యోగ జేఏసీ తరఫున నిరసనలు, ధర్నాలు చేపడుతామని హెచ్చరించారు.
సోమవారం బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో మీడియా సమావేశంలో తెలంగాణ నిరుద్యోగ వ్యా యామ విద్య ఉపాధ్యాయ సంఘం (టీయూపీఈటీఏ) అధ్యక్షుడు మాదగోని సైదులుగౌడ్ మాట్లాడుతూ.. వ్యా యా మ విద్య ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేస్తామని కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో ప్రకటించిందని గుర్తుచేశారు. నిరుద్యోగ పీఈటీల మద్దతుతో గెలిచి.. ఇప్పుడు మాట మార్చిందని మండిపడ్డారు.
హైదరాబాద్, సెప్టెంబర్ 1 (నమస్తే తె లంగాణ): ఆర్టిజన్ల కన్వర్షన్ డిమాండ్‌తో ఉద్యమబాట పట్టిన ఆర్టిజన్ల జేఏసీతో సోమవారం జరగాల్సిన చర్చలు అర్ధాంతరంగా వాయిదాపడ్డాయి. కార్మికశాఖ అధికారుల సమక్షంలో సంప్రదింపులు జరగాల్సి ఉండగా, అసెంబ్లీ సమావేశాలను సాకుగా చూపించి చర్చలను వాయిదావేశారు. జేఏసీ, ట్రాన్స్‌కో అధికారుల మధ్య సోమవారం సంప్రదింపులు జరగాల్సి ఉండగా వాయిదాపడ్డాయి. దీంతో జేఏసీ నేతలు కార్మికశాఖ కార్యాలయంలో ధర్నాకు దిగారు. స్పందించిన అధికారులు ఈ నెల 4న చర్చలు జరుపుతామని ప్రకటించడంతో జేఏసీ నేతలు శాంతించారు.