హైదరాబాద్, డిసెంబర్ 8 (నమస్తే తెలంగాణ): మైనార్టీ గురుకులాల్లో ఖాళీగా ఉన్నచోట అవకాశమిచ్చి తమకు న్యాయం చే యాలని ఆ సొసైటీలో సుదీర్ఘకాలంగా పనిచేస్తున్న కాంట్రాక్ట్ పీడీ, పీఈటీలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ మేరకు ఆదివా రం ఒక ప్రకటన విడుదల చేశారు. 2017 నోటిఫికేషన్ కింద సుమారు 190 మంది పీఈటీలు మైనార్టీ గురుకులాలకు ఎంపియ్యారని, ఈ నేపథ్యంలో తమను పక్కన పెట్టినట్టు గుర్తుచేశారు. పాఠశాలల్లో ఒకే సబ్జెక్ట్‌కు ఇద్దరు, ముగ్గురు ఉపాధ్యాయులు ఉన్నప్పుడు.. స్కూల్ మొత్తానికి ఇద్దరు పీడీలు, పీఈటీలు ఉంటే తప్పేంటని ప్రశ్నిస్తున్నారు. ఈ విషయమై హెడ్ ఆఫీస్, జిల్లా అధికారు ల చుట్టూ తిరిగినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. న్యాయం చే యాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.
సమ్మెలోకి సమగ్ర శిక్షా ఉద్యోగులు ; రేపటి నుంచి చాక్‌డౌన్, పెన్‌డౌన్
హైదరాబాద్, డిసెంబర్ 8 (నమస్తేతెలంగాణ): సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సమగ్ర శిక్షా ఉద్యోగులు సమ్మె బాట పట్టనున్నారు. ఈ నెల 10వ తేదీ నుంచి చాక్‌డౌన్, పెన్‌డౌన్ చేసి నిరసన తెలపనున్నారు. సమ్మెలో జిల్లా, మం డల విద్యాశాఖ కార్యాలయాలు, ఉన్నత పాఠశాలల్లోని వొకేషనల్ ఇన్‌స్ట్రక్చర్ సి బ్బంది పాల్గొనున్నట్టు తెలంగాణ సమగ్ర శిక్షా ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దుండిగల్ యాదగిరి, ప్రధాన కార్యదర్శులు ఝూన్సీ, సౌజన్య తెలిపారు. కాగా, సిబ్బంది సమ్మెలోకి వెళ్తుండటంతో కేజీబీవీ, అర్బన్ రెసిడెన్షియల్ స్కూళ్లు, భవిత కేంద్రాల్లో బోధన నిలిచిపోనున్నది.