హైదరాబాద్, ఆగస్టు 1 (నమస్తే తె లంగాణ): వైద్యారోగ్య శాఖలోని వివిధ విభాగాల్లో కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ప ద్ధతిలో పనిచేస్తున్న ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని తెలంగాణ యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ డిమాండ్ చేసింది. యూనియన్ నేతలు గురువారం కోఠిలోని ఎన్హెచ్ఎం కమిషనర్ కార్యాలయ ముట్టడికి యత్నించారు.
పోలీసులు వారిని అ రెస్టు చేశారు. యూనియన్ రాష్ట్ర ప్రధా న కార్యదర్శి యాదనాయక్ మాట్లాడు తూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 8 నెలలవుతున్నా వైద్యారోగ్య శాఖలో పనిచేస్తున్న ఉద్యోగుల సమస్యలను పరిష్క రించడం లేదని ఆరోపించారు. మహిళా ఉద్యోగులకు వేతనంతో కూడిన ప్రసూ తి సెలవులు ఇవ్వాలని, పనిభారం తగ్గించాలని, బదిలీలకు అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు.