హైదరాబాద్, డిసెంబర్ 25 ( నమస్తే తెలంగాణ): ర్యాగింగ్ ఆరోపణలు ఎదురొంటున్న డాక్టర్ సైక్ అలీఖాన్‌పై ఉన్న సస్పెన్షన్ ఎత్తివేసి పరీక్షలకు అనుమతి ఇవ్వాలని గతంలో జారీ చేసిన ఉత్తర్వులను అమలు చేయకపోవడంతో కాకతీయ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్‌కు హైకోర్టు కోర్టు ధికరణ నోటీసు జారీ చేసింది. డాక్టర్ ప్రీతి ఆత్మహత్యకు సైక్ అలీఖాన్ కారణమంటూ కాలేజీ నుంచి సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. దీంతో అలీఖాన్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సస్పెన్షన్‌ను రద్దు చేస్తూ పీజీ పరీక్షలకు అనుమతించాలని హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులను అమలు చేయకపోవడంతో అలీఖాన్ కాకతీయ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ రామకుమార్ రెడ్డిపై కోర్టు ధికరణ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ కే లక్ష్మణ్ విచారణ చేపట్టారు.