వరంగల్, అక్టోబర్ 28 : తమ ప్రాంతం లో కలుషిత నీరు సరఫరా అవుతున్నా స్థానిక ఎమ్మెల్యేగా ఉన్న మంత్రి కొండా సురేఖ, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు పట్టించుకోవడం లేదంటూ కాశీబుగ్గ ప్రాంత ప్రజలు ఆందోళనకు దిగారు. మంగళవారం బీఆర్ఎస్ ఆధ్వర్యంలో బాధిత ప్రజ లు బాటిళ్లలో కలుషిత నీటిని తీసుకొచ్చి బల్ది యా కార్యాలయాన్ని ముట్టడించారు. అధికారుల చాంబర్లలోకి, సిబ్బంది వద్దకు వెళ్లి కలుషిత నీటిని తాగాలని పట్టుబట్టారు. ఈ నీటిని తాగితే తాము ఆందోళన విరమిస్తామని స్ప ష్టంచేశారు. ప్రజలకు తాగునీళ్లు ఇవ్వలేని కొండా సురేఖ తన మంత్రి పదవికి రాజీనా మా చేయాలని డిమాండ్ చేశారు.
చివరికి కౌ న్సిల్ హాలులో సమావేశంలో ఉన్న మేయర్ గుండు సుధారాణి, కమిషనర్ బయటకు రావాలని నినదిస్తూ బైఠాయించారు. గంటపాటు ఉన్నా మేయర్, కమిషనర్ బయటికి రాలేదు. పోలీసులు బలవంతంగా వారిచే ఆందోళన విరమింపజేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ జిల్లా నాయకుడు మంతెన అమరేశ్ మాట్లాడుతూ.. మంత్రి సురేఖకు వాటా లు, వసూళ్లపై ఉన్న శ్రద్ధ ఓట్లు వేసి గెలిపించిన ప్రజల సమస్యలపై లేదని ఆరోపించారు. వరంగల్ తూర్పు నియోజకవర్గ ప్రజలు కలుషిత తాగునీటిని తాగుతూ ఇబ్బందులు పడుతుంటే మంత్రి జూబ్లీహిల్స్ ఉపఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నారని
విమర్శించారు.