హైదరాబాద్, అక్టోబర్ 10 (నమస్తే తెలంగాణ): రాజధాని నగరంలో అల్వాల్, సనత్నగర్, ఎల్బీ నగర్లలో నిర్మించే సూపర్ స్పెషాలిటీ దవాఖానల నిర్మాణానికి మెఘా, ఎల్అండ్టీ, డీఈసీ సంస్థలు ఆర్థిక అర్హత సాధించాయి. గతంలో ఈ కంపెనీలు సాంకేతిక అర్హత సాధించడంతో ఆర్థిక అర్హతలను పరిశీలించారు. రోడ్లు భవనాలశాఖ అధికారులు ఆయా కంపెనీల ఆర్థిక అర్హతలను పరిశీలించి ఆమోదించారు. ఫైనాన్స్ డాక్యుమెంట్లలో ఈ మూడు కంపెనీలు అర్హత సాధించడంతో కమిషనర్ ఆఫ్ టెండర్స్ (సీవోటీ)కు పంపించారు. సీవోటీ పరిశీలించిన తరువాత ఏ సంస్థ ఏ దవాఖానను నిర్మిస్తుందో ఫైనల్ చేస్తారు.