హైదరాబాద్, జూలై 4 (నమస్తే తెలంగాణ): యూనిఫాం సర్వీసెస్ పోస్టుల భర్తీలో మొదటి ప్రక్రియ ప్రారంభమైంది. సబ్ ఇన్స్పెక్టర్, తత్సమాన పోస్టులకు ఆగస్టు 7 (ఆదివారం)న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ప్రాథమిక రాత పరీక్ష నిర్వహించనున్నట్టు రాష్ట్ర పోలీస్ నియామక బోర్డు (టీఎస్ఎల్బీఆర్బీ) చైర్మన్ వీవీ శ్రీనివాసరావు తెలిపారు. పోలీస్ కానిస్టేబుల్, తత్సమాన పోస్టులకు ప్రిలిమ్స్ ఆగస్టు 21న ఉదయం 10 గంటల నుంచి ఒంటిగంట వరకు నిర్వహిస్తామని సోమవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. అభ్యర్థులు తమ హాల్టికెట్లను టీఎస్ఎల్పీఆర్బీ వెబ్సైట్ ‘www.tslprb.in’ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు.