రామారెడ్డి, అక్టోబర్ 27 : కుటుంబ కలహాలతో మనస్తాపం చెందిన ఓ కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్న ఘటన కామారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. రామారెడ్డి మండలం మద్దికుంటకు చెందిన రేకులపల్లి జీవన్‌రెడ్డి (38) జిల్లా కేంద్రంలోని ఎస్పీ హెడ్ క్వార్టర్స్‌లో ఏఆర్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. ఆయనకు ముస్తాబాద్ మండలం మొరాయిపల్లికి చెందిన చందనతో కొన్నేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. దంపతుల మధ్య కలహాలు ఏర్పడడంతో భార్య ఏడాది క్రితం పుట్టింటికి వెళ్లి పోయింది. కాపురానికి రమ్మని భర్త పలుమార్లు కోరినప్పటికీ ఆమె రాలేదు.
దీంతో మనస్తాపం చెందిన జీవన్‌రెడ్డి.. సోమవారం ఇంటి నుంచి బైక్‌పై బయల్దేరాడు. అడ్లూర్ శివారులోని రాధాస్వామి సత్సంగ్బాగ్ ఆశ్రమం వెనుకకు వెళ్లిన జీవన్‌రెడ్డి ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అటువైపు వెళ్లిన గొర్రెల కాపరి మృతదేహాన్ని చూసి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. ఎస్పీ రాజేశ్చంద్ర, ఏఎస్పీ చైతన్యారెడ్డి, అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని ప్రభుత్వ దవాఖానకు తరలించిన దేవునిపల్లి పోలీసులు.. తండ్రి రాజారెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.