చాంద్రాయణగుట్ట, ఏప్రిల్ 16 : మజ్లిస్ పార్టీ ఓవైసీ బ్రదర్స్‌ను చంపేందుకు ప్లాన్ వేస్తున్నారని చాంద్రాయణగుట్ట నియోజకవర్గం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళవారం హైదరాబాద్ పాతబస్తీలోని రాయల్ క్లాసిక్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన తఖ్రీబ్ ఈద్ మిలాబ్ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ పాతబస్తీలో మజ్లిస్ పార్టీ బలంగా ఉన్నదని, ఓవైసీ బ్రదర్స్ తిరుగులేని శక్తిగా ఎదగడంతో కొందరు కక్ష కట్టారని పేర్కొన్నారు. అక్బరుద్దీన్ ఓవైసీ, అసదుద్దీన్ ఓవైసీ ఇద్దరు అన్నదమ్ములను జైలుకు పంపి వైద్యం పేరిట విషం ఇచ్చి లేదా గన్‌తో కాల్చి చంపేందుకు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. అయినా తామెవరికీ భయపడేది లేదన్నారు. ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా చివరకు గెలుపు మాదేనన్నారు.