హైదరాబాద్, అక్టోబర్ 30 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర పౌరసరఫరా ల శాఖలో ఇప్పటివరకు రూ.1,150 కోట్ల భారీ కుంభకోణం జరిగిందని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్రెడ్డి ఆరోపించారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బుధవారం మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వం తాజాగా తెచ్చిన జీవో 27 ఆ శాఖలో అవినీతి ని మరింత పెంచేలా ఉన్నదని ధ్వజమెత్తారు. 35 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం తరలింపునకు గడువు పూర్త యి 5 నెలలైనా కాంట్రాక్టర్లపై ఎందు కు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్ని ంచారు. ఇదే రూ.800 కోట్ల వరకు కుంభకోణమని ఆరోపించారు.