పెద్దకొత్తపల్లి, డిసెంబర్ 5: నాగర్కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి మండలం జొన్నలబొగుడలో మహి ళా సర్పంచ్ ఇందిర ఇంటిపై మంగళవారం కాంగ్రె స్ కార్యకర్తులు దాడి చేశారు. సర్పంచ్, ఆమె అత్తకు గాయాలయ్యాయి. ప్రజాస్వామ్యంలో గె లుపోటములను సమానంగా స్వీకరించాలే కానీ దాడులు చేయడమేంటని గ్రామస్థులు ప్రశ్నిస్తున్నారు. సర్పంచ్ భర్త రవినాయక్ మాట్లాడుతూ.. ఐదేండ్లుగా గ్రామంలో ఇలాంటి గూండా రాజకీయాలు చూడలేదన్నారు. దాడులకు పాల్పడే వారి పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.