హైదరాబాద్, సెప్టెంబర్ 30 (నమస్తే తెలంగాణ): కర్ణాటకలో కొత్తగా ఎన్నికైన కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతికి తెరలేపిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. తెలంగాణలో జరిగే ఎన్నికల్లో నిధుల సమీకరణకు బెంగళూరు బిల్డర్లపై పొలిటికల్ ఎలక్షన్ టాక్స్‌ను ప్రతి చదరపు అడుగుకు రూ.500 చొప్పున పన్ను విధించడం ప్రారంభించిందని ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ఆరోపించారు. గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్.. స్కాముల వారసత్వంతో సాంగ్రెస్గా మారిపోయిందని ఎద్దేవా చేశారు. కర్ణాటక నిధులను తీసుకొచ్చి తెలంగాణలో ఎంత వెదజల్లినా ఇకడి ప్రజలను మోసం చేయలేరని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో ప్రజలు సాంగ్రెస్ను తిరసరిస్తారని స్పష్టం చేశారు.