KTR | జాబ్ క్యాలెండర్‌కు నై నై.. స్కామ్ క్యాలెండర్‌కు మాత్రం సై సై అంటున్నరు : కేటీఆర్
KTR | అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని నవంబర్ 2023లో కాంగ్రెస్ వాళ్లు జాబ్ క్యాలెండర్ ప్రకటించారు. ఆనాడు మా రాష్ట్ర నిరుద్యోగులను మోసం చేసిన అశోక్ నగర్ గుర్తుందా రాహుల్ గాంధీ..? అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు.
KTR | ఉద్యోగాలు అడిగితే ఎండ్రిన్ తాగి చావమంటావా..? దమ్ముంటే రేవంత్ రెడ్డి రేపు సెక్యూరిటీ లేకుండా రా.. ఎవడు బతకాలో, ఎవడు సావాలో మా పోలీస్ అభ్యర్థులే తేలుస్తారని హెచ్చరించారు. హైదరాబాద్ సరూర్ నగర్లో తలపెట్టిన యువ సంగ్రామ సదస్సులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా విద్యార్థులు కేటీఆర్ మాట్లాడుతూ.. లోకల్ కాంగ్రెస్, కల్తీ కాంగ్రెసోళ్లు చెప్తే నమ్ముతలేరని చెప్పి ఢిల్లీకెళ్లి టూరిస్టులను తీసుకొచ్చిర్రు. ఆనాడు హైదరాబాద్‌లోని అశోక్‌నగర్‌కు ఢిల్లీ నుంచి అధిష్టాన పుత్రుడు రాహుల్ గాంధీ వచ్చిండు. హైదరాబాద్ నడిబొడ్డున కూర్చొని చాయ్ తాగిండు, బిస్కెట్లు తిన్నడు. మనకు కూడా కొన్ని బిస్కెట్లు వేసిండు. కేసీఆర్, కేటీఆర్ ఉద్యోగాలు పీకేయండి.. ఒకటే సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్న కేటీఆర్ మీరు కనుక మరిచిపోతే ఒకసారి రాహుల్ గాంధీ ఏమన్నడో స్క్రీన్‌పై చూడాలని విద్యార్థిలోకానికి, నిరుద్యోగ యువతకు చూపించారు. ఆనాడు మా రాష్ట్ర నిరుద్యోగులను మోసం చేసిన అశోక్ నగర్ గుర్తుందా రాహుల్ గాంధీ..? అని కేటీఆర్ ప్రశ్నించారు.
అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని నవంబర్ 2023లో కాంగ్రెస్ వాళ్లు జాబ్ క్యాలెండర్ ప్రకటించారు. అన్ని పత్రికల్లో మొదటి పేజీలో ప్రకటనలు విడుదల చేశారని.. ఓటు కొట్టు.. జాబ్ పట్టు అని ఆఫర్ ఇచ్చారని మండిపడ్డారు. ఇవాళ ఉలుకు లేదు.. పలుకు లేదు.. జాబులు నింపడం లేదు కానీ రాహుల్ గాంధీ జేబులు మాత్రం జోరుగా నింపుతున్నారు. జాబ్ క్యాలెండర్‌కు మాత్రం నై నై.. స్కామ్ క్యాలెండర్‌కు సై సై అంటున్నరని కేటీఆర్ ఫైర్ అయ్యారు.
అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని నవంబర్ 2023లో కాంగ్రెస్ వాళ్లు జాబ్ క్యాలెండర్ ప్రకటించారు
అన్ని పత్రికల్లో మొదటి పేజీలో ప్రకటనలు విడుదల చేశారు
ఓటు కొట్టు.. జాబ్ పట్టు అని ఆఫర్ ఇచ్చారు
ఇవాళ ఉలుకు లేదు.. పలుకు లేదు
జాబులు నింపడం లేదు కానీ… https://t.co/kACyu8kesH pic.twitter.com/Gem8P9Lq6A
— Telugu Scribe (@TeluguScribe) July 18, 2026
‘విద్యార్థులు సాంకేతిక విద్యను సద్వినియోగం చేసుకోవాలి’
ఉద్యోగాలు అడిగితే ఎండ్రిన్ తాగి చావమంటావా
దమ్ముంటే సెక్యూరిటీ లేకుండా రా రేవంత్ రెడ్డి
ఎవడు బ్రతకాలో, ఎవడు సావాలో మా పోలీస్ అభ్యర్థులే తెలుస్తారు
– కేటీఆర్ https://t.co/qoWg4aFmgJ pic.twitter.com/VDlY8cW56x
— Telugu Scribe (@TeluguScribe) July 18, 2026
Read Also :
Skyroot Aerospace: కక్ష్యలోకి ప్రైవేటు రాకెట్ పంపిన మూడో దేశం మనదే: స్కైరూట్ ఏరోస్పేస్
Yuva Sangrama Sadassu | ఎండ్రిన్ తాగాల్సింది మేం కాదు.. నువ్వు.. సీఎం రేవంత్ రెడ్డిపై నిరుద్యోగ యువతి ఫైర్
‘విద్యార్థులు సాంకేతిక విద్యను సద్వినియోగం చేసుకోవాలి’
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hanumakonda | అసమాన ప్రతిభతో ‘ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్’లో చోటు.. చిన్నారిని అభినందించిన స్కూల్ యాజమాన్యం..!
IND vs WI | చితక్కొట్టిన శాంసన్, తిలక్, అయ్యర్.. రాంచీలో విండీస్ ముందు కొండంత లక్ష్యం..!
Pregnancy | గర్భం కోసం ప్రయత్నిస్తున్న మహిళలు.. ఎప్పుడు ఫెర్టిలిటీ నిపుణులని కలవాలి..?
Students Appeal | ‘మాబడిలో హిందీ టీచర్ లేరు.. కలెక్టర్‌కు చెప్పి మూడు నెలలైనా నియమించలే’..!
Newlywed Couple’s Bodies | కాళ్లకు గొలుసులతో.. నదిలో నూతన దంపతుల మృతదేహాలు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

