Dr. C. Laxma Reddy | రాష్ట్రానికి పట్టిన శని కాంగ్రెస్ పార్టీ : మాజీ మంత్రి డా.సి.లక్ష్మారెడ్డి
Dr. C. Laxma Reddy | రాష్ట్రంలోని అన్ని రంగాలను సర్వనాశనం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు పట్టిన శనిలా దాపురించిందని మాజీ మంత్రి డా.సి.లక్ష్మారెడ్డి ఆరోపించారు.
మహబూబ్ నగర్ : రాష్ట్రంలోని అన్ని రంగాలను సర్వనాశనం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ ( Congress Party) తెలంగాణకు పట్టిన శనిలా దాపురించిందని మాజీ మంత్రి డా.సి.లక్ష్మారెడ్డి ( Dr. C. Laxma Reddy ) ఆరోపించారు. జడ్చర్ల నియోజకవర్గం నవాబ్ పేట మండల కేంద్రంలో గురువారం నిర్వహించిన బీఆర్ఎస్ రైతు గర్జనలో ఆయన మాట్లాడారు.

సంక్షేమ పథకాలు ఇవ్వకుండా కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని లూటీ చేస్తుంది. అంతర్గత కుమ్ములాటలు,వాటాల పంచాయితీతో కాంగ్రెస్ పార్టీ రోడ్డున పడిందని విమర్శించారు. తెలంగాణ సొమ్ము ఢిల్లీకి మూటలు మోస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో అడ్మినిస్ట్రేషన్ కుప్పకూలింది.. కనీసం మంచినీళ్లు ఇవ్వడానికి ప్రభుత్వానికి చేతకావడం లేదని అన్నారు. కాంగ్రెస్ చేతిలో మోసపోయిన ప్రజలకు అండగా నిలిచేందుకు నిరసన కార్యక్రమాలు చేపట్టామని వెల్లడించారు.
రైతు సంక్షేమం కోసం కేసీఆర్ అనేక కార్యక్రమాలు చేపట్టారని వివరించారు. కేసీఆర్ను తిట్టడానికే రేవంత్ రెడ్డి మీటింగ్లు పెడుతున్నాడని తెలిపారు. కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలని ప్రజలు ముక్తకంఠంతో కోరుకుంటున్నారని అన్నారు.
పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ చేపడితే పనులు పూర్తి చేయకుండా పెండింగ్ పెట్టిందని దుయ్యబట్టారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Antibiotics | యాంటీ బయోటిక్స్కు లొంగని బ్యాక్టీరియాను సైతం నాశనం చేసే వైరస్.. సైంటిస్టుల పరిశోధన..
Teacher Rapes Girl | విద్యార్థినులకు లైంగిక వేధింపులు, ఒక బాలికపై అత్యాచారం.. ప్రభుత్వ టీచర్ అరెస్ట్
KCR | తెలంగాణ ఆడబిడ్డలకు కేసీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు
Delhi Police | నిరసనల సందర్భంగా మహిళలపై లైంగిక హింస.. ఢిల్లీ పోలీస్ హెడ్క్వార్టర్స్ వరకు మహిళా సంఘాల ర్యాలీ
Haiku Movie | కాలేజీ రోజులను గుర్తు చేసే సున్నితమైన ప్రేమకథ ‘హైకూ’.. అక్టోబర్ 23న భారీ విడుదల!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

