నమస్తే తెలంగాణ నెట్వర్క్, ఆగస్టు 14 : కాంగ్రెస్ ఎంపీటీసీ సభ్యులు బీఆర్ఎస్లో చేరారు. సూర్యాపేట జిల్లా పెన్‌పహాడ్ మండలం అనాజీపురం కాంగ్రెస్ ఎంపీటీసీ గద్దల నాగరాజుతోపాటు ఆ పార్టీకి చెందిన పలువురు నాయకులు సోమవారం హైదరాబాద్‌లో విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. మంత్రి వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. జనగామ జిల్లా దేవరుప్పుల మండలం కామారెడ్డిగూడెం కాంగ్రెస్ ఎంపీటీసీ మహ్మద్ జాకీర్ పర్వతగిరిలో పంచాయత్‌రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. అదేవిధంగా గ్రామ శాఖ అధ్యక్షుడు పులిపంపుల భాస్కర్, యూత్ నాయకుడు మెహర్ జాకీర్ కూడా గులాబీ కండువా కప్పుకొన్నారు.