పెద్దపల్లి, డిసెంబర్ 24 (నమస్తే తెలంగాణ): పెద్దపల్లి కలెక్టర్‌కు కులపిచ్చి ఉన్నదని కాంగ్రెస్ ఎంపీ వంశీకృష్ణ విమర్శించారు. ఆయన అగ్రకుల మైండ్‌సెట్‌తో పనిచేస్తున్నాడని మండిపడ్డారు. కాకా జయంతి, వర్ధంతి ని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్నా పెద్దపల్లి కలెక్టర్ మాత్రం నిర్లక్ష్యం చేశారని ఆగ్రహం వ్యక్తంచేశారు. అక్టోబర్ 5న పెద్దపల్లి కలెక్టరేట్లో గడ్డం వెంకటస్వామి జయంతి వేడుకలు నిర్వహించిన కలెక్టర్.. రెండ్రోజుల క్రితం వర్ధంతిని నిర్వహించలేదని మండిపడ్డారు. మంగళవారం పెద్దపల్లిలో వంశీకృష్ణ మీడియాతో మాట్లాడారు. కాకా వర్ధంతి వేడుకల నిర్వహణకు ప్రభుత్వం జీవో ఇచ్చిందని, కానీ అగ్రకుల మైండ్‌సెట్‌తో ఉన్న కలెక్టర్ కులపిచ్చితో పనిచేస్తున్నారని ఆరోపించారు. ఎంపీగా తనను కూడా కలెక్టర్ పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారని దుయ్యబట్టారు.