Congress | హైదరాబాద్, మార్చి 25 (నమస్తే తెలంగాణ): అభివృద్ధి పనులపై ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం రూ.500 కూడా ఖర్చు పెట్టలేని పరిస్థితి నెలకొన్నదని కాంగ్రెస్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి స్పష్టంచేశారు.
విద్య, రోడ్లు భవనాలతోపాటు పలు శాఖలకు సంబంధించి బడ్జెట్ పద్దులపై అసెంబ్లీలో మంగళవారం కొనసాగిన చర్చలో ఆయన మాట్లాడుతూ.. ఫ్రీ బస్సుతో మహిళలు ఇప్పటికే రూ.5 వేల కోట్లు సేవ్ చేశారని, వాటిని ఇంటి ఖర్చులు, పిల్లల కోసం వెచ్చిస్తున్నారని తెలిపారు. మ్యానిఫెస్టోలో పెట్టిన అంశాలను పదే పదే ప్రస్తావిస్తున్నారని, నిధుల లేమితో మ్యానిఫెస్టో అమలుకు ఆలస్యమవుతుందని వెల్లడించారు. ఫీజు రీయింబర్స్మెంట్ డబ్బు లు కొన్ని ప్రైవేట్ కాలేజీల జేబుల్లోకే వెళ్తున్నాయని, దానిపై చర్చిస్తామని వెల్లడించారు.
30న సన్నబియ్యం పంపిణీ ప్రారంభం ; హుజూర్‌నగర్‌లో ప్రారంభించనున్న సీఎం, మంత్రి ఉత్తమ్
హైదరాబాద్, మార్చి 25 (నమస్తే తెలంగాణ): రేషన్ దుకాణాల ద్వారా సన్న బియ్యం పంపిణీ చేసే పథకాన్ని ప్రభుత్వం ఈనెల 30న ప్రారంభించనుంది. హుజూర్నగర్ పట్టణంలో భారీ బహిరంగ సభలో సీఎం రేవంత్‌రెడ్డి, సివిల్‌సైప్లె మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఈ పథకానికి శ్రీకారం చుట్టనున్నారు. ఈ మేరకు సభ, సీఎం, మంత్రుల షెడ్యూల్ ఖరారైంది. ఈ పథకాన్ని సివిల్‌సైప్లె మంత్రి ఉత్తమ్ సొంత నియోజకవర్గంలోనే నిర్వహిస్తుండటం గమనార్హం. ఏప్రిల్ 1నుంచి రాష్ట్ర వ్యాప్తంగా తెల్ల రేషన్‌కార్డుదారులందరికీ ప్రభుత్వం సన్నబియ్యం పంపిణీ చేయనుంది.