కామారెడ్డి : ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించడం కాంగ్రెస్(Congress) పార్టీకి పరిపాటిగా మారింది. ఎన్నికల్లో ఎలాగైనా గెలువాలనే తలంపుతో ఆ పార్టీ నేతలు అడ్డదారుల్లో వెళ్తూ వివాదాలు సృష్టి చేస్తున్నారు. ప్రచారం ముగిసినందున ఆయా నియోజకవర్గాల్లో స్థానికేతరులు ఉండొద్దని ఈసీ ఇప్పటికే స్పష్టం చేసింది. అయితే కాంగ్రెస్ పార్టీ నేతలు మాత్రం ఇవేవి పట్టించుకోవడంలేదు.
తాజాగా కామారెడ్డి(Kamareddy) నియోజకవర్గం బస్వాపూర్ గ్రామం వద్ద ఉన్న కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ(Shabbir Ali) ఫామ్ హౌస్‌లో కర్ణాటక ఎమ్మెల్యే రిజ్వాన్ అర్షద్ ఎన్నికల నిబంధనలను ఉల్లంఘిస్తూ ఫామ్ హౌస్ కేంద్రంగా ప్రలోభాలకు పాల్పడుతున్నారు. నాన్ లోకల్ వ్యక్తులు ఈ ప్రాంతం నుంచి వదిలి వెళ్లాలని స్థానికులు విజ్ఞప్తి చేసినా పట్టించుకోవడంలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. సమాచారం అందుకున్న బీఆర్ఎస్ శ్రేణులు షబ్బీర్ అలీ ఫార్మ్ హౌస్‌కి బయలుదేరారు. క్షేత్రస్థాయిలో పరిశీలించి ఈసీకి ఫిర్యాదు చేయనున్నారు.