హైదరాబాద్, అక్టోబర్ 6 (నమస్తే తెలంగాణ): నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ సీనియర్ నేత గీతారెడ్డి గురువారం ఢిల్లీలో ఈడీ విచారణకు హాజరయ్యారు. గతంలో ఇచ్చిన నిధులు, ఇతర అంశాలపై పలు ప్రశ్నలు అడిగినట్టు సమాచారం.
ఇప్పటికే కాంగ్రెస్ అధినేత్రి సోనియా, రాహుల్‌లను ఈడీ విచారించింది. తాజాగా నేషనల్ హెరాల్డ్‌కు గతంలో నిధులు సమకూర్చిన రాష్ట్ర నేతలు గీతారెడ్డి, సుదర్శన్‌రెడ్డి, షబ్బీర్ అలీకి నోటీసులు జారీ చేసింది.