ఆర్కేపురం, ఏప్రిల్ 13 : బీసీలను కించపరుస్తూ వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ నేత మోహన్‌రెడ్డి వెంటనే క్షమాపణలు చెప్పాలని తెలంగాణ రాష్ట్ర ఎంబీసీ కో-కన్వీనర్ రాచమల్ల బాలకృష్ణ, నాయీ బ్రహ్మణ సేవా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెంబర్తి శ్రీనివాస్ డిమాండ్ చేశారు. శనివారం ఆర్కేపురంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు.
రాష్ట్రంలో 70 శాతం బీసీల జనాభా ఉందని, బీసీ సమాజంలో ఉన్న అన్ని కులవృత్తులు సమాజంతో ముడిపడి ఉన్నాయని, అలాంటి వారి పట్ల మోహన్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు కులహంకారానికి నిదర్శనమని బాలకృష్ణ పేర్కొన్నారు. మళ్లీ బీసీ వర్గాలను అవమానిస్తే నాలిక కోస్తామని హెచ్చరించారు. బీసీ సోదరులారా ఇప్పటికైనా ఆలోచించి మన ఓట్లు మనకే, మన సీట్లు మనకే అనే నినాదంతో ముందుకు పోవాలని పిలుపునిచ్చారు.