Madhu Yashki | వాళ్లు కాంగ్రెస్‌పై ప్రేమతో రాలేదు.. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై మధుయాష్కీ సంచలన వ్యాఖ్యలు
Madhu Yashki | కాంగ్రెస్‌లో చేరే ఎమ్మెల్యేలు పార్టీపై ప్రేమతో రావడం లేదని టీపీసీసీ ప్రచార కార్యదర్శి, మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్ అన్నారు. తమ అక్రమాస్తులను కాపాడుకోవడానికే కాంగ్రెస్‌లో చేరుతున్నారని సంచలన వ్యాఖ్యలుచేశారు. కాంగ్రెస్ సిద్ధాంతాలు అంటే వాళ్లకు విశ్వాసమే లేదని విమర్శించారు.
Madhu Yashki | కాంగ్రెస్‌లో చేరే ఎమ్మెల్యేలు పార్టీపై ప్రేమతో రావడం లేదని టీపీసీసీ ప్రచార కార్యదర్శి, మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్ అన్నారు. తమ అక్రమాస్తులను కాపాడుకోవడానికే కాంగ్రెస్‌లో చేరుతున్నారని సంచలన వ్యాఖ్యలుచేశారు. కాంగ్రెస్ సిద్ధాంతాలు అంటే వాళ్లకు విశ్వాసమే లేదని విమర్శించారు. జగిత్యాలలో తన అనుచరుడు గంగారెడ్డి దారుణ హత్య అనంతరం ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఫిరాయింపులను ప్రోత్సహించడంపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పెద్దలు ఫోన్ చేసినా తన స్వరాన్ని తగ్గించలేదు. ఈ క్రమంలోనే జీవన్ రెడ్డిని కలిసి బుజ్జగించేందుకు జగిత్యాల మధుయాష్కీ వెళ్లారు. జీవన్ రెడ్డిని పరామర్శించిన అనంతరం మీడియాతో మాట్లాడారు.
ముందుగా కాంగ్రెస్ నేత గంగారెడ్డి హత్యపై మధుయాష్కీ జీవన్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబాన్ని అన్నివిధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. కేసును లోతుగా దర్యాప్తు చేయకుండానే పాత కక్షల కారణంగానే హత్య చేశారని పోలీసులు చెప్పడం విచారకరమని అన్నారు. తనకు ప్రాణహాని ఉందని గంగారెడ్డి ముందుగానే పోలీసులకు చెప్పినప్పటికీ రక్షణ కల్పించడంలో నిర్లక్ష్యం వహించారని మండిపడ్డారు. అనంతరం పార్టీ ఫిరాయింపులపై కీలక వ్యాఖ్యలు చేశారు.
రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత అభద్రతభావంతో ఇతర పార్టీ ఎమ్మెల్యేలను కాంగ్రెస్‌లో చేర్చుకోవాల్సి వచ్చిందని మధుయాష్కీ తెలిపారు. అలా వచ్చిన వాళ్లెవరూ కాంగ్రెస్ సిద్ధాంతాలను నమ్మి పార్టీలోకి రాలేదని.. స్వలాభంతో పాటు తమ ఆస్తులను కాపాడుకునేందుకే వస్తున్నారని తెలిపారు. కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యేలకు నామినేటెడ్ పదవుల విషయంలో ఎలాంటి హామీ ఇవ్వలేదని పేర్కొన్నారు. మొదటి నుంచి పార్టీ కోసం పనిచేసిన వారికే నామినేటెడ్ పదవుల్లో ప్రాధాన్యం ఉంటుందని స్పష్టం చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
MLA Sudheer Reddy | జైపాల్ రెడ్డిపై లేని ప్రేమంతా ఒలకబోస్తున్న రేవంత్ రెడ్డి : ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి
Road Accident | డివైడర్‌ను ఢీకొన్న బైక్.. ఇద్దరు మృతి
చెకుముకి సైన్స్ సంబురాలు-2026 పోస్టర్ ఆవిష్కరణ
Narnoor | గోవర్ధన్ గుట్టపై ఆదివాసుల సాంప్రదాయ పూజలు
Women Professor | వీసీ అల్డాస్ జానయ్య వేధింపులకు మరో మహిళా ప్రొఫెసర్ కంటతడి.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

