మహబూబ్ నగర్ : అధికార కాంగ్రెస్ నాయకుల ( Congress Leaders ) ఆగడాలు రోజురోజుకూ మితిమీరి పోతున్నాయి. జిల్లాలోని భూత్పూర్ మండలం మద్దిగట్ల ( Maddigatla ) గ్రామంలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ కార్యకర్త వెంకటేశ్ బీఆర్ఎస్ సానుభూతిపరుడు విజయానికి కృషి చేశాడు. దీన్ని దృష్టిలో పెట్టుకుని భూత్పూర్ కాంగ్రెస్ మండలాధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి, యువజన కాంగ్రెస్ మండల అధ్యక్షుడు భూపతిరెడ్డి మరికొందరు కిడ్నాప్ చేశారని బాధితుడు ఆరోపించారు.
కారులో అడవిలోకి తీసుకెళ్లి మారణాయుధాలతో దాడి చేసి హత్యాయత్నం చేశారని పేర్కొన్నారు. పోలీసులు స్పందించి తనపై హత్యాయత్నానికి పాల్పడ్డ నిందితులపై చట్టపర చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తక్షణమే శ్రీనివాస్ రెడ్డిని కాంగ్రెస్ మండలాధ్యక్ష స్థానం నుంచి తొలగించాలని కోరారు. గతంలో జడ్చర్ల పోలీస్ స్టేషన్లో కాంగ్రెస్ మండలాధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి పోలీసుల కాలర్ పట్టి బెదిరించిన కేసులో ఉన్నాడు.