ఎమ్మెల్యే సామేలుపై కాంగ్రెస్ నాయకుల ఫైర్.. కాక రేపుతున్న కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షుల నియామకం
ఈ నెల 3న ప్రకటించిన కాంగ్రెస్ మండలాధ్యక్షుల నియామకాలు కాంగ్రెస్‌లో మరోసారి చిచ్చురేపాయి. ఆదివారం కొమ్మలలో కాంగ్రెస్ నాయకుల నియోజకవర్గ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పార్టీ సీనియర్ నాయకుడు ధరూరి యోగా నందచార్య మాట్లాడుతూ..
తుంగతుర్తి, జూలై 5 : ఈ నెల 3న ప్రకటించిన కాంగ్రెస్ మండలాధ్యక్షుల నియామకాలు కాంగ్రెస్‌లో మరోసారి చిచ్చురేపాయి. ఆదివారం కొమ్మలలో కాంగ్రెస్ నాయకుల నియోజకవర్గ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పార్టీ సీనియర్ నాయకుడు ధరూరి యోగా నందచార్య మాట్లాడుతూ.. ఎమ్మెల్యే సామేలు పలు సమావేశాల్లో 50 వేల మెజార్టీతో గెలిచానని గొప్పగా చెప్పుకొంటున్నారని ఎద్దేవాచేశారు. సామేలును చూసి ఓట్లు వేయలేదని, కాంగ్రెస్ పార్టీని చూసి ఓటర్లు ఓట్లు వేశారని చెప్పారు.
దమ్ముంటే రాజీనామాచేసి గెలిచి చూపించాలని డిమాండ్ చేశారు. వార్డు మెంబర్‌గా కూడా గెలువని సామేలును కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేను చేసిందని చెప్పారు. వెంటనే మండల అధ్యక్షుల నియామకాలు రద్దు చేయకుంటే ఢిల్లీలో తేల్చుకుంటామని హెచ్చరించారు. అనంతరం ఎమ్మెల్యే కబంధ హస్తాల నుంచి కాంగ్రెస్ పార్టీని కాపాడండి.. ఎమ్మెల్యే డౌన్‌డౌన్ అంటూ అర్వపల్లి చౌరస్తాలో ధర్నా నిర్వహించారు. దీంతో జనగామ-సూర్యాపేట జాతీయ రహదారిపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
సైబర్ నేరాల పట్ల అప్రమత్తతే ప్రధానం : పోలీస్ కమిషనర్ సునీల్ దత్
Oxygen Cylinder Explodes | అంబులెన్స్‌లో పేలిన ఆక్సిజన్ సిలిండర్.. రోగి మృతి, ఇద్దరికి గాయాలు
SI Lingam | చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే సహించేది లేదు : ఎస్సై లింగం
Mental Health | మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే 5 పోషక లోపాలు.. ఈ లక్షణాలను అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు
‘బీసీ ఉద్యమ నేత గుజ్జ సత్యంకు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ ఇవ్వాలి’
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

