Adilabad | ఆదిలాబాద్ : ప్రతి రోజు కోట్ల రూపాయల అభివృద్ధి జరుగుతోందంటూ ఓ వైపు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటనల వర్షం కురిపిస్తుంటే.. మరోవైపు అభివృద్ధి పనులు మాత్రం ఎక్కడికక్కడ నిలిచిపోయిన పరిస్థితి నెలకొంది. ఆదిలాబాద్ పట్టణంలోని కైలాస్ నగర్లో చిరు వ్యాపారుల సౌకర్యార్థం గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ పనులను ప్రారంభించారు.
పనులు పూర్తి చేసేందుకు గతంలో నిధులు సైతం మంజూరు కాగా.. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడంతో పనులు పిల్లర్ల వద్దనే ఆగిపోయాయి. వందలాది మంది వ్యాపారం చేసుకోవాల్సిన స్థలం.. సగం పనులతో నిర్మానుష్యంగా కనిపిస్తుండడం ప్రభుత్వ చిత్తశుద్ధి ఏంటో అర్థమవుతుంది. నిధులు విడుదల చేసి పనులు పూర్తి చేయాలని ఇటీవల మాజీ మంత్రి జోగు రామన్న సైతం జిల్లా ఉన్నతాధికారులను కలిసి నివేదించారు.