Telangana | హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 2 (నమస్తే తెలంగాణ)/కవాడిగూడ: పదేండ్ల పండుగ పేరిట కాంగ్రెస్ సర్కారు ఆదివారం నిర్వహించిన రాష్ర్టావతరణ వేడుకల్లో ఉద్యమకారులకు తీవ్ర అన్యాయం జరిగింది. ఆహ్వాన పత్రికలను తీసుకొని వచ్చినవారిని లోపలికి అనుమతించకుండా అవమానించారు. మరెందరో ఉద్యమ నేతలను ఉత్సవాలకు పిలువకుండా నిర్లక్ష్యం ప్రదర్శించింది. రాత్రిట్యాంక్బండ్పై నిర్వహించిన వేడుకల్లో పాల్గొనేందుకు వచ్చిన పలువురు ప్రముఖులు, ఉద్యమకారులను వేదిక వద్దకు అనుమతించనేలేదు. యక్షగాన కళాకారుడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత గడ్డం సమ్మయ్య ట్యాంక్‌బండ్‌పై అనామకుడిగా అందరితో క లిసి వేడుకలను వీక్షించారు. కాంగ్రెస్ ప్రభు త్వం తమను పిలిచి అవమానించిందని ఉద్యమకారులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ వేదిక వద్ద నిరసన తెలిపారు. ఆహ్వానపత్రాన్ని చూపినా లోపలికి అనుమతించలేదని వారు మండిపడ్డా రు. విషయం తెలుసుకున్న పోలీసులు ఉద్యమకారులకు నచ్చజెప్పి లోపలికి పంపించారు.
ఆహ్వానపత్రికలతో ట్యాంక్‌బండ్‌పై నిరసన
తెలంగాణ ఉద్యమంలో ఎన్నో నిర్బంధాల ను అనుభవించిన తమ త్యాగాలకు గుర్తింపు ఇదేనా అంటూ పలువురు ఉద్యమకారులు మండిపడుతున్నారు. ఆహ్వాన పత్రికలను ప్రదర్శిస్తూ పలువురు ట్యాంక్‌బండ్‌పై నిలబడి నిరసన తెలిపారు. ఆహ్వాన పత్రికలు ఉండి ట్యాం క్బండ్పైకి అనుమతిలేని వారు కొందరైతే, ఆ హ్వాన పత్రికలనే పంపకుండా అవమానించిన తొలి, మలిదశ ఉద్యమకారులు భారీ సంఖ్య లో ఉన్నట్టు సమాచారం. అందరినీ ఆహ్వానించామంటూ చెప్పిన టీఎస్‌జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం, సీఎం రేవంత్‌రెడ్డి మాటలు వట్టివేననీ దీంతో తేటతెల్లమైంది. ఉద్యమ సమయంలో పోలీసుల లాఠీలు, అక్రమ కేసులతో వేధింపులకు గురైతే, ఇప్పుడు అధికారిక ఆహ్వాన పత్రికలు ఉండి కూడా అనుమతించక పోవడమేంటని ఆందోళన వ్యక్తం చేశారు.
తొలి తరం ఉద్యమకారుడికి పిలుపేది?
తెలంగాణ రాష్ట్ర సాధన అంతిమ ధ్యేయంగా తొలితరం ఉద్యమం నుంచి స్వరాష్ట్ర సాధన కోసం పోరాడిన సంగంరెడ్డి (ముచ్చర్ల) సత్యనారాయణ కుటుంబానికి ఊహించని అవమాన మే జరిగింది. 1953లోనే నాన్ ముల్కీ గో బ్యాక్ అంటూ గొంతెత్తి, 1969లో కాసు బ్రహ్మానందరెడ్డి దురాగాతాలను ఎండగట్టిన గొప్ప పో రాటయోధుడు సత్యనారాయణ. 1983లోనే రాజకీయ కురువృద్ధుడైన హయగ్రీవచారిని ఓడించి చరిత్రలో చెరిగిపోని ముద్ర వేసుకున్నారు. కవిగా, తొలితరం వాగ్గేయకారుడిగా, రచయితగా, వక్తగా ప్రొఫెసర్ జయశంకర్ సన్నిహితుడిగా ఉంటూ వచ్చిన ముచ్చర్ల ఉద్యమానికి ఊపిరిలూదారు. అలాంటి ఉద్యమ చరిత్ర ఉన్న ముచ్చర్ల కుటుంబాన్ని కూడా దశాబ్ది ఉత్సవాలకు పిలువకుండా అవమానించింది.
‘ఎవరి పాలయ్యిందిరో తెలంగాణ’: పృథ్వీరాజ్
నిజమైన తెలంగాణ ఉద్యమకారులకు సరైన గుర్తింపే లేదని క్రాంతిదళ్ అధ్యక్షుడు, ముచ్చర్ల కుటుంబానికి చెందిన పృథ్వీరాజ్ ఆవేదన వ్య క్తం చేశారు. ఇవాళ ప్రభుత్వం వ్య వహరించిన తీరు చూస్తే ‘ఎవరి పాలయ్యిందిరో తెలంగాణ’ అనే మాటను గుర్తుకు తెస్తున్నాయని చెప్పారు. స్వరాష్ట్ర సాధనే లక్ష్యంగా బతికిన ఎంతో మం ది తాము ఉద్యమకారులమని చెప్పుకోవాల్సిన దౌర్భాగ్యాన్ని ప్రభుత్వం తెచ్చిందని తెలిపారు. ప్రభుత్వం ఆహ్వానించనంత మాత్రాన తమ ఉద్యమ ఆనవాళ్లు చెరిగిపోవని స్పష్టం చేశారు.