చిక్కడపల్లి, ఫిబ్రవరి 9: 70 వేల ఉద్యోగాలు ఎప్పుడు, ఎక్కడ భర్తీ చేశారో చెప్పాలని, వీటిపై శ్వేతపత్రం విడుదల చేయాలని నిరుద్యోగ జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. ఉద్యోగాల భర్తీ విషయంలో సీఎం రేవంత్‌రెడ్డి ఝూటా మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. సోమవారం చిక్కడపల్లి సిటీ సెంట్రల్ లైబ్రరీలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో జేఏసీ నాయకులు శంకర్‌నాయక్, ఇంద్రానాయక్, రవి రాథోడ్ తదితరులు మాట్లాడుతూ.. ఉద్యోగ నోటిఫికేషన్ రాక ఇటీవల కుమారస్వామి అనే నిరుద్యోగి ఆత్మహత్య చేసుకున్నాడని గుర్తుచేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండున్నరేండ్లు కావస్తున్నా ఒక్క ఉద్యోగ నోటిఫికేషన్ జారీ చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. ఉద్యోగ నోటిఫికేషన్లు రాక దాదాపు 20 మం దికిపైగా నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ఇటీవల టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ మాట్లాడుతూ.. ఐదేండ్ల లో రెండు లక్షల ఉద్యోగాలు భర్తీచేస్తామని చె ప్పామనడం బాధాకరమని పేర్కొన్నారు. చ ట్టబద్ధమైన జాబ్ క్యాలెండర్ ను విడుదల చే యాలని డిమాండ్‌చేశారు. ఎన్నికల ముందు లైబ్రరీల చుట్టూ తిరిగిన కాం గ్రెస్ నాయకులు, ఉద్యోగ నోటిఫికేషన్ల విషయంలో ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు.