హైదరాబాద్, జూలై 26(నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ నవ్వులపాలవుతున్నది. సొంత పార్టీ నేతల్లోనే అసంతృప్తి వ్యక్తమవుతున్నది. పేరులోనే క్రమశిక్షణ ఉంది తప్ప.. కార్యాచరణలో లేదనే విమర్శ లు వ్యక్తమవుతున్నాయి. రోజుకో నాయకుడు పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నా వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోకపోవడంపై పా ర్టీలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నది. ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఏకంగా సీఎం రేవంత్‌రెడ్డి మాటల్నే తప్పుబట్టారు. పదేండ్లు తానే సీఎం అంటూ సీఎం రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యల్ని కోమటిరెడ్డి ఖండించా రు.
పరోక్షంగా సీఎం రేవంత్‌రెడ్డి నిఖార్సైన కాంగ్రెస్ నేత కాదనే అంశంతో పాటు ఆయన మరోసారి సీఎం అయ్యేందుకు తాము అంగీకరించబోమనే సంకేతాలు ఇచ్చారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి ఏకంగా పార్టీలో, ప్రభుత్వంలో చంద్రబాబు కోవర్టులు ఉన్నారంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక కొండా మురళీ కథే వేరు. ఆయన్ను క్రమశిక్షణ కమిటీ విచారణ కు పిలిస్తే హైదరాబాద్‌కు వచ్చిన ఆయన తిరి గి ఇతర నేతలపై ఫిర్యాదు చేయడంతో పాటు గాంధీభవన్ ఆవరణలోనే వారిపై తీవ్ర విమర్శలు చేశారు. అయినా చర్యల్లేవు.
మొన్నటి వరకు క్రమశిక్షణ కమిటీ చైర్మన్‌గా ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ చిన్నారెడ్డి వ్యవహరించారు. ఇటీవల మార్పుల్లో భాగం గా ఎంపీ మల్లురవిని క్రమశిక్షణ కమిటీ చైర్మన్‌గా అధిష్ఠానం నియమించింది. అయితే ఆ యనపైనే ఆరోపణలు రావడం గమనార్హం. బిల్లుల చెల్లింపు కోసం క్రమశిక్షణ కమిటీ చై ర్మన్ మల్లురవి కమీషన్లు తీసుకుంటున్నారం టూ మాజీ ఎమ్మె ల్యే సంపత్‌కుమార్ ఆరోపించారు. దీనిపై అధిష్ఠానానికి లేఖ కూడా రాశారు. ఇక ఆయన ఈ పదవికి ఎలా న్యాయం చేస్తారనే మాట పార్టీ నేతల నుంచి వినిపిస్తున్నది. ఇప్పటికైనా క్రమశిక్షణ కమిటీని బలోపేతం చేసి, పార్టీ గీత దాటితే చర్యలు తీసుకోవాలనే డిమాండ్లు పార్టీలో వినిపిస్తున్నాయి.