మహబూబ్‌నగర్ : ఎన్నికల్లో అనేక హామీలిచ్చి అమలు చేయకుండా అన్ని వర్గాలను కాంగ్రెస్ మోసం ( Congress Deceived ) చేస్తుందని మాజీ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ ( Srinivas Goud ) ఆరోపించారు. మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గం భూత్పూర్ లో శుక్రవారం బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం 1000 రోజుల పాలనలో ప్రజలకు ఇచ్చిన హామీలు, 6 గ్యారెంటీలు, 13 డిక్లరేషన్ల అమలు చేయడంలో విఫలమైందని ఆరోపించారు. ఈ సందర్భంగా 420 అడుగుల భారీ బ్యానర్‌ను ప్రదర్శించారు. రైతులు, మహిళలు, వృద్ధులు, విద్యార్థులు, నిరుద్యోగులు సహా అన్ని వర్గాలను మోసం చేసిందని, ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.