నమస్తే న్యూస్‌నెట్‌వర్క్, జనవరి 21: నల్లనేల భగ్గుమన్నది. సింగరేణిలో కాంగ్రెస్ అవినీతి చర్యలకు పాల్పడుతున్నదంటూ బీఆర్ఎస్, టీబీజీకేఎస్ చేపట్టిన ఆందోళనలతో దద్దరిల్లింది. సింగరేణి సంస్థను కొత్త కొత్త అక్రమాలతో దోచుకునేందుకు కాంగ్రెస్ పెద్దలు కుట్ర పన్నుతున్నారని, ఒరిస్సాలోని నైని బ్లాక్ గనులు సైట్ విజిటింగ్ సర్టిఫికెట్ ద్వారా దోచుకునేందుకు ఎత్తులు వేస్తున్నారని, కోల్ ఇండియాలో లేని ఈ విధానం సింగరేణిలో ఎందుకంటూ బుధవారం సింగరేణి వ్యాప్తంగా టీబీజీకేఎస్, బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఆందోళనలు చేపట్టారు. పెద్దపల్లి జిల్లా రామగుండంలోని ఆర్జీ-1 జీఎం కార్యాలయం ఎదుట పెద్దపల్లి బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్, టీబీజీకేఎస్ అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి, టీబీజీకేఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మాదాసి రామమూర్తి తదితరులు ధర్నా చేశారు.

సింగరేణి ఆర్జీ-2 పరిధిలోని వకీల్‌పల్లి గని, జీఎం కార్యాలయం ఎదుట టీబీజీకేఎస్ అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి, నా యకులు, ఆర్జీ-3 జీఎం కార్యాలయం ఎదుట టీబీజీకేఎస్ అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్, టీబీజీకేఎస్ ఉపాధ్యక్షుడు నాగెల్లి సాం బయ్య వేర్వేరుగా ధర్నాలు చేశారు. కొత్తగూడెంలోని సింగరేణి ప్రధాన కార్యాలయం, సత్తుపల్లి, ఇల్లెందు ఏరియాల్లోని జీఎం కార్యాలయాలను బీఆర్ఎస్, టీబీజీకేఎస్ నాయకులు ముట్టడించారు. హెడ్డాఫీస్ ఎదుట ఉన్న సింగరేణి తల్లికి టీబీజీకేఎస్ చీఫ్ జనరల్ సెక్రటరీ కాపు కృష్ణ వినతిపత్రం సమర్పించి ‘సింగరేణిని నీవే కాపాడుకోవాలి తల్లీ..’ అంటూ ప్రాధేయపడ్డారు. బీఆర్ఎస్ భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు, మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
సత్తుపల్లిలో ప్రభుత్వ ఏరియా దవాఖాన నుంచి సింగరేణి జీఎం కార్యాలయం వరకు మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ఆధ్వర్యంలో బీఆర్ఎస్, టీబీజీకేఎస్ నాయకులు బైక్‌ర్యాలీ నిర్వహించా రు. ఏరియా కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి జీఎం శ్రీనివాస్‌కు వినతిపత్రం అందజేశారు. భద్రాద్రి జిల్లా ఇల్లెందులో నిర్వహించిన ధర్నాలో బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, భద్రాద్రి జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ అధ్యక్షుడు దిండిగాల రాజేందర్ పాల్గొన్నారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలోని కాంటా చౌరస్తా వద్ద టీబీజీకేఎస్ కేంద్ర కమిటీ సంయుక్త కార్యదర్శి దాసరి శ్రీనివాస్ అధ్యక్షతన నిర్వహించిన ధర్నా లో మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య పాల్గొన్నారు.

శ్రీరాంపూర్‌లోని జీఎం ఆఫీస్ ఎదుట బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు విజిత్‌రావు, టీబీజీకేఎస్ ప్రధాన కార్యదర్శి కేతిరెడ్డి సురేందర్‌రెడ్డి, ఉపాధ్యక్షుడు బండి రమేశ్, నా యకులతో కలిసి ధర్నా చేశారు. మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు, టీబీజీకేఎస్ రాష్ట్ర ప్రధాన కా ర్యదర్శి కేతిరెడ్డి సురేందర్‌రెడ్డి పాల్గొన్నారు. కాసిపేటలో టీబీజీకేఎస్ సెంట్రల్ ఆర్గనైజేషన్ సెక్రటరీ బెల్లం అశోక్, పిట్ కార్యదర్శి బైరి శంకర్ పాల్గొన్నారు. మందమర్రి ఏరియాలోని కాసిపేట-2 ఇైంక్లెన్ గనిపై టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో గని ఇన్చార్జి మేనేజర్‌కు వినతిపత్రం అందించారు.
సింగరేణి సొమ్మును వారి అనుయాయులకు దోచిపెట్టేందుకే సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కలిసి కొత్తగా సైట్ విజిట్ విధానానికి తెరతీశారని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు ర విచంద్ర ఆరోపించారు. భద్రాద్రి జిల్లా కేంద్రమైన కొత్తగూడెంలోని సింగరేణి హెడ్డాఫీస్ ఎదుట జరిగిన ధర్నాలో ఆయన మాట్లాడారు. తమ అనుయాయులకు అడ్వాన్స్‌గా టెండర్లను ఇవ్వాలనే దురాలోచనతో సైట్ విజిట్ విధానాన్ని ప్రవేశపెట్టారని విమర్శించారు. సింగరేణి సంస్థను కేంద్రం ప్రైవేట్‌పరం చేయకుండా గత కేసీఆర్ ప్రభుత్వం కాపాడిందని గుర్తుచేశారు.
కాంగ్రెస్ సర్కార్ సింగరేణి సంస్థను నిర్వీర్యం చేసి కార్మికుల నోట్లో మట్టి కొట్టాలని చూస్తే ఊరుకునేది లేదని టీబీజీకేఎస్ అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి హెచ్చరించారు. బుధవారం పెద్దపల్లి జిల్లా రామగిరి మండలంలోని ఆర్జీ-2 పరిధిలోని వకీల్‌పల్లి గని, జీఎం కార్యాలయం ఎదుట టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో భారీ ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడుకునేందుకు ఎంతటి పోరాటాలకైనా సిద్ధంగా ఉన్నామని స్పష్టంచేశారు. రాష్ట్ర అభివృద్ధిలో వెన్నెముకగా నిలిచిన సింగరేణిని రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఏటీఎంగా మార్చివేసిందని ధ్వజమెత్తారు. సాక్షాత్తు సీఎం, డిప్యూటీ సీఎం, మరో మంత్రి తమ అనుయాయులకు కట్టబెట్టేందుకు చేసిన పన్నాగాలు బహిర్గతమయ్యాయని పేర్కొన్నారు. నైని బ్లాక్ గనులు సైట్ విజిటింగ్ సర్టిఫికెట్ ద్వారా దోచుకునేందుకు యత్నిస్తున్నారని ఆరోపించారు.
కాంగ్రెస్ సర్కార్‌తో సింగరేణి సంస్థ మనుగడకే ప్రమాదం ఏర్పడిందని సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ఆందోళన వ్యక్తంచేశారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో సింగరేణి సత్తుపల్లి ఏరియా జీఎం కార్యాలయం ఎదుట బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలోని కాంగ్రెస్, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాలు కుమ్మకై సింగరేణికి, సింగరేణి కార్మికులకు తీరని అన్యాయం చేస్తున్నాయని విమర్శించారు. ఈ అక్రమాలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
సింగరేణిలో సైట్ విజిట్ దందాపై సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరి పించాలని భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి డిమాండ్ చేశారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని అంబేదర్ సెంటర్లో బీఆర్ఎస్ నాయకులు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పరిపాలన చేతగాని కాంగ్రెస్ ప్రభుత్వం సింగరేణిని పూ ర్తిగా ఆర్థిక సంక్షోభంలోకి తీసుకువెళ్లిందని విమర్శించారు. ఎవడబ్బ సొమ్మని సీఎం రేవంత్ ఫుట్‌బాల్ ఆటకు సింగరేణి నిధులు రూ.10 కోట్లు ఖర్చు చేశారని ప్రశ్నించారు.

పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలోని ఆర్జీ-1 జీఎం కార్యాలయం ఎదుట ధర్నా చేస్తున్న పెద్దపల్లి బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్, టీబీజీకేఎస్ అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి, బీఆర్ఎస్ శ్రేణులు.

రేవంత్ సర్కార్ బొగ్గు స్కామ్‌ను నిరసిస్తూ ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో సింగరేణి సత్తుపల్లి ఏరియా జీఎం కార్యాలయం ఎదుట ధర్నా చేస్తున్న బీఆర్ఎస్, టీబీజీకేఎస్ నాయకులు. చిత్రంలో ధర్నాలో మాట్లాడుతున్న సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య.

మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని కాంటా చౌరస్తా వద్ద బీఆర్ఎస్ ధర్నాలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య.