యైటింక్లయిన్‌కాలనీ, మార్చి 27: ‘కార్పొరేటర్‌గా నాపైనే పోటీ చేసే మొగోడివా..? నీకెంత ధైర్యం’ అంటూ దుర్భాషలాడుతూ కార్పొరేషన్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన గూడెల్లి రాంచందర్‌పై 18వ డివిజన్ కార్పొరేటర్ దేవనపల్లి చక్రపాణి దాడి చేశాడు. గురువారం రాత్రి హనుమాన్ దేవాలయం వద్దకు వచ్చిన గూడెల్లిపై ఒక్కసారి మీదపడి పిడిగుద్దులు గుద్దుతూ దాడికి దిగాడు. ఈ ఘటనలో ఇరువర్గాలు గోదావరిఖని టూటౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసుకున్నాయి. బాధితుడు గూడెల్లి రాంచందర్ తెలిపిన వివరాల ప్రకారం.. శ్రీరామనవమి కల్యాణానికి సంబంధించిన తలంబ్రాల పంపిణీ కోసం గూడెల్లి రాంచందర్ హనుమాన్ దేవాలయానికి వెళ్లగా అక్కడే ఉన్న కార్పొరేటర్ ‘నాపైనే పోటీ చేస్తావా? నీకు ఎంత ధైర్యం’ అంటూ మీద పడి దుర్భాషలాడుతూ పిడిగుద్దులు గుద్దాడు. ఈ ఘటనకు ముందే మరో వ్యక్తిపై సైతం సదరు కార్పొరేటర్ దాడి చేసినట్టు తెలిసింది. దీనిపై సదరు వ్యక్తిని సంప్రదించగా తనపై దాడి జరిగిన విషయం నిజమేనని, ఈ విషయాన్ని రాద్ధాంతం చేయవద్దని తెలిపారు.