Hema | టాలీవుడ్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సీనియర్ నటి హేమ మరోసారి వార్తల్లో నిలిచారు. ఈసారి ఏ సినిమా కారణంగానో, వివాదం కారణంగానో కాదు.. ఆమె కొనుగోలు చేసిన లగ్జరీ కారుతో అందరి దృష్టిని ఆకర్షించారు. కుటుంబ సభ్యులతో కలిసి కొత్త మెర్సిడెస్-బెంజ్ కారును డెలివరీ తీసుకున్న హేమ, ఆ సందర్భంగా దిగిన ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియాలో పంచుకోవడంతో అవి వైరల్‌గా మారాయి. తాజాగా హేమ కొనుగోలు చేసిన కారు మెర్సిడెస్-బెంజ్ GLS 450d లగ్జరీ డీజిల్ SUV. ఈ మోడల్ ఎక్స్‌షోరూమ్ ధర సుమారు రూ.1.34 కోట్ల నుంచి రూ.1.43 కోట్ల వరకు ఉంటుంది. ఆంధ్రప్రదేశ్‌లో పన్నులు, రిజిస్ట్రేషన్, ఇన్సూరెన్స్ తదితర ఖర్చులతో కలిపి ఈ కారు ఆన్‌రోడ్ ధర సుమారు రూ.1.58 కోట్ల నుంచి రూ.1.76 కోట్ల మధ్య ఉండే అవకాశం ఉంది.
కొత్త కారు కొనుగోలు చేసిన సందర్భంగా హేమకు అభిమానులతో పాటు సినీ ప్రముఖులు కూడా సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఆమె షేర్ చేసిన వీడియోకు పెద్ద ఎత్తున లైక్‌లు, కామెంట్లు వస్తున్నాయి. హేమ సినీ ప్రయాణం విషయానికి వస్తే.. 1989 నుంచే తెలుగు చిత్ర పరిశ్రమలో నటిగా కొనసాగుతున్నారు. అక్క, అత్త, తల్లి, స్నేహితురాలు వంటి ఎన్నో పాత్రల్లో తనదైన నటనతో ప్రేక్షకులను మెప్పించారు. ముఖ్యంగా బ్రహ్మానందంతో కలిసి చేసిన కామెడీ సన్నివేశాలు ఆమెకు మంచి గుర్తింపును తీసుకొచ్చాయి.
గత కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉన్న హేమ, బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీ కేసు సందర్భంగా వార్తల్లో నిలిచారు. అయితే ఆ ఆరోపణలను ఆమె ఖండిస్తూ తాను ఎలాంటి తప్పూ చేయలేదని స్పష్టం చేశారు. అనంతరం తనపై వచ్చిన ఆరోపణలకు సంబంధించి తన వాదనను వెల్లడిస్తూ వివరణ ఇచ్చారు. అలాగే గతంలో బిగ్‌బాస్ తెలుగు షోలో కూడా పాల్గొన్న హేమ, కొద్ది వారాలకే ఎలిమినేట్ అయ్యారు. ఇప్పుడు కొత్త లగ్జరీ బెంజ్ కారును కొనుగోలు చేయడంతో ఆమె పేరు మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. అభిమానులు “హేమ మళ్లీ వార్తల్లోకి వచ్చారు” అంటూ సరదాగా స్పందిస్తున్నారు.