FIFA World Cup 2026 | వైకింగ్స్పై ఇంగ్లాండ్ ఘన విజయం.. రెండు గోల్స్‌తో సెమీస్‌కు చేర్చిన బెల్లింగామ్!
FIFA World Cup 2026: ఫిఫా ప్రపంచ కప్ 2026లో భాగంగా జరిగిన ఉత్కంఠభరిత క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ జట్టు ఘన విజయం సాధించింది.
FIFA World Cup 2026: ఫిఫా ప్రపంచ కప్ 2026లో భాగంగా జరిగిన ఉత్కంఠభరిత క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ జట్టు ఘన విజయం సాధించింది. ఫ్లోరిడాలోని ప్రతిష్టాత్మక హార్డ్ రాక్ స్టేడియంలో జూలై 11న జరిగిన ఈ హోరాహోరీ పోరులో ఇంగ్లాండ్ 2-1 గోల్స్ తేడాతో నార్వే (వైకింగ్స్) జట్టును మట్టికరిపించి సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. ఇంగ్లాండ్ స్టార్ మిడ్‌ఫీల్డర్ జుడే బెల్లింగామ్ రెండు అద్భుతమైన గోల్స్ చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించి మ్యాచ్ హీరోగా నిలిచాడు. ఈ మ్యాచ్ ప్రారంభం నుండి ఇరు జట్లు హోరాహోరీగా తలపడ్డాయి. ఆట 36వ నిమిషంలో నార్వే ఆటగాడు ఆండ్రియాస్ శేల్డెరప్ ఒక అద్భుతమైన గోల్ చేసి తన జట్టుకు 1-0 ఆధిక్యాన్ని అందించాడు. అయితే, మొదటి హాఫ్ ముగిసే సమయానికి లభించిన ఇంజ్యూరీ టైమ్‌లో (45+2′) జుడే బెల్లింగామ్ సూపర్ గోల్‌తో స్కోరును 1-1తో సమం చేసి ఇంగ్లాండ్‌ను మళ్లీ రేసులోకి తెచ్చాడు.
ఆ తర్వాత సెకండ్ హాఫ్‌లో నార్వే స్టార్ స్ట్రైకర్ ఎర్లింగ్ హాలాండ్ 56వ నిమిషంలో ఒక గోల్ చేసినప్పటికీ, ఫౌల్ కారణంగా వీడియో అసిస్టెంట్ రెఫరీ (VAR) రివ్యూలో అంపైర్ ఆ గోల్‌ను తిరస్కరించారు. అదేవిధంగా ఇంగ్లాండ్ కెప్టెన్ హ్యారీ కేన్ చేసిన ఒక గోల్‌ను కూడా ఆఫ్‌సైడ్‌గా ప్రకటించారు. నిర్ణీత 90 నిమిషాల సమయం ముగిసేసరికి ఇరు జట్లు 1-1తో సమంగా నిలవడంతో మ్యాచ్ ఎక్స్ట్రా టైమ్‌కు (AET) దారితీసింది.
ఎక్స్ట్రా టైమ్ ప్రారంభమైన కొద్దిసేపటికే, అంటే మ్యాచ్ 93వ నిమిషంలో బెల్లింగామ్ మరో క్లినికల్ గోల్ సాధించి ఇంగ్లాండ్‌కు 2-1 ఆధిక్యాన్ని అందించాడు. ఆ తర్వాత నార్వే ఎంత ప్రయత్నించినప్పటికీ ఇంగ్లాండ్ డిఫెన్స్‌ను ఛేదించలేకపోయింది. ఈ చారిత్రాత్మక విజయంతో థామస్ టూషెల్ నేతృత్వంలోని ఇంగ్లాండ్ జట్టు సెమీస్‌కు అర్హత సాధించింది. జూలై 15న అట్లాంటా స్టేడియంలో జరగబోయే సెమీఫైనల్ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ జట్టు అర్జెంటీనా లేదా స్విట్జర్లాండ్‌తో తలపడనుంది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
BRS AUSTRALIA | వెలుగు పత్రిక తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం : అనిల్ బైరెడ్డి
AP Muncipal Elections | ఈ నెల 28వ తేదీన ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలకు సెలవు!
Shakambari Devi | శాకాంబరీదేవిగా వేయిస్తంభాల రుద్రేశ్వరీదేవి దర్శనం
Harish Rao | రైతుకూలీల బిడ్డలు డాక్టర్లు కావడం గర్వకారణం : మాజీ మంత్రి హరీష్‌రావు
TGSRTC | పండుగ వేళ టికెట్ ఛార్జీల బాదుడు.. 2003 జీవో పేరుతో సమర్థించుకున్న టీజీఎస్ఆర్టీసీ!
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

