Jupally Krishna Rao | కొల్లాపూర్: కొల్లాపూర్ కాంగ్రెస్ అభ్యర్థి జూపల్లి కృష్ణారావుకు సొంత ఊరిలో పరాభవం ఎదురైంది. సోమవారం చిన్నంబావి మండలం పెద్దదగడలో ఆయన మాట్లాడుతుండగా మహిళలు అడ్డుకున్నారు. 19 ఏండ్లు అధికారంలో ఉండి గ్రామాన్ని ఏం చేశావని నిలదీశారు.
దీంతో సహనం కోల్పోయిన జూపల్లి ఆగ్రహంతో ఊగిపోయారు. ఏమీ చేయలేక అక్కడి నుంచి వెనుదిరిగారు.