టేక్మాల్/అందోల్, సెప్టెంబర్ 26: వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ప్రాతినిధ్యం వహిస్తున్న అందోల్ నియోజకవర్గంలోని టేక్మాల్ పీఏసీఎస్ చైర్మన్ యశ్వంత్రెడ్డిపై గురువారం కాంగ్రెస్‌కు చెందిన సొసైటీ డైరెక్టర్, ఆయన అనుచరుడు దాడికి పాల్పడ్డారు. డైరెక్టర్ అనుచరుడు భూమయ్య సైతం చైర్మన్‌పై దాడికి పాల్పడటంతో నోటి నుంచి తీవ్ర రక్తస్రావమైంది. వెంటనే బాధితులు టేక్మాల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. యశ్వంత్రెడ్డిపై దాడికి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అందోల్ మాజీ ఎమ్మె ల్యే చంటి క్రాంతికిరణ్ డిమాండ్‌చేశారు. జోగిపేటలో యశ్వంత్‌రెడ్డిని ఆయన పరామర్శించారు.