పోలీస్ అధికారుల ఎన్నికలు ఉన్నట్టా? లేనట్టా?
తెలంగాణ పోలీసు అధికారుల సంఘం ఎన్నికల నిర్వహణలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి.
- వాయిదా పడినట్టు మౌఖిక ఆదేశాలు
- బైలాస్‌ను రూపొందించక పోవడమే అసలు కారణమా?
- డీజీపీ చొరవతో జిల్లా స్థాయిలో పూర్తయిన ఎన్నికలు
- రాష్ట్రస్థాయిలో సంఘం ఎన్నికలకే అడ్డంకులు
హైదరాబాద్, నవంబర్ 1 (నమస్తే తెలంగాణ): తెలంగాణ పోలీసు అధికారుల సంఘం ఎన్నికల నిర్వహణలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. రాష్ట్ర స్థాయి నూతన కార్యవర్గాన్ని ఎన్నుకొనేందుకు ఆదివారం ఎన్నికలు నిర్వహించాల్సి ఉండగా, అనూహ్యంగా ఆ ప్రక్రియకు బ్రేక్ పడింది. రాష్ట్రస్థాయి ఎన్నికలను వాయిదా వేస్తున్నట్టు పోలీసు ఉన్నతాధికారులు మౌఖికంగా ఆదేశాలు ఇచ్చారని పోలీసు సిబ్బంద చెప్తున్నారు. ఇందుకు సంబంధించి ఇప్పటివరకూ ఎలాంటి అధికారిక ఉత్తర్వులు వెలువడకపోవడం చర్చనీయాంశంగా మారింది.
పోలీసు అధికారుల సంఘం ఎన్నికల నిర్వహణకు సంబంధించి అవసరమైన నిబంధనలు, మార్గదర్శకాలను రూపొందించడంలో జాప్యం జరిగిందని సమాచారం. సంఘం బైలాస్ పూర్తిస్థాయిలో సిద్ధం కాకపోవడమే రాష్ట్రస్థాయి ఎన్నికల వాయిదాకు ప్రధాన కారణమని పోలీసు వర్గాల్లో ప్రచారం జరుగుతున్నది. అయితే, ఈ కారణాలపై అధికారికంగా ఎలాంటి ప్రకటన వెలువడలేదు. కాగా, డీజీపీ సీవీ ఆనంద్ చొరవతో జిల్లా స్థాయిలో పోలీసు అధికారుల సంఘం ఎన్నికల ప్రక్రియ పూర్తయినట్టు సమాచారం. రాష్ట్రస్థాయిలో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకొనే విషయంలో మాత్రం అడ్డంకులు ఎదురవుతున్నాయి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

