కరీంనగర్ విద్యానగర్, జూన్ 3: ప్రభుత్వ నర్సింగ్ క ళాశాలల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ నుంచి ప్రొఫెసర్ ఉద్యోగోన్నతుల వ్యవహారం మరోసారి వివాదాస్పదంగా మారిం ది. లెక్చరర్ నుంచి అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా ప్రమోషన్లు క ల్పించే విషయంలో అమలు చేసే ‘రూల్ ఆఫ్ రిజర్వేషన్’ను వర్తింపజేయడంపై అసంతృప్తి వ్యక్తమవుతున్నది.
రాష్ట్రంలో 37 ప్రభుత్వ నర్సింగ్ కాలేజీలు ఉండగా గతనెల చేపట్టిన ప్రమోషన్లపై విమర్శలు వస్తున్నాయి. రూల్ ఆఫ్ రిజర్వేషన్ పేరిట సీనియర్లకు అన్యాయం చేశారని ఉ ద్యోగులు మండిపడుతున్నారు. గతంలో సీనియారిటీ జాబితాలో చివర్లో ఉన్న పేర్లు, ఇప్పుడు ముం దువరుసలోకి రావడం వెనుక అసలు ప్రమాణాలు ఏమిటని ప్రశ్నిస్తున్నారు. అప్పటి అధికారులు తయారు చేసిన జాబితా సరైనదా..? లేక ఇప్పుడు తయారు చేసిన జాబితానే సరైనదా..? అని సిబ్బంది బహిరంగంగానే నిలదీస్తున్నారు. నిబంధనల ప్రకారం.. ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపాల్ వంటి పరిపాలనా పదవుల్లో సీనియారిటీనే ప్రామాణికంగా తీసుకోవాల్సి ఉంటుందని చెబుతున్నారు.
గాంధీ నర్సింగ్ కళాశాలకు ఏకంగా ఏడుగురు ప్రొఫెసర్లను కేటాయించగా, మరికొన్ని కళాశాలలకు ఐదుగురు, ముగ్గురు చొప్పున నియమించినట్టు చెబుతున్నారు. జిల్లాల్లో ప్రొఫెసర్ స్థాయి అధికారులు లేకుండానే కళాశాలలు కొనసాగుతున్నా పరిగణనలోకి తీసుకోలేదని పేర్కొంటున్నారు. కాలేజీల అవసరాల కంటే కోరుకున్న చోట పోస్ట్ ఇవ్వడానికే ప్రాధాన్యం ఇచ్చినట్టు కనిపిస్తున్నదని ఆరోపిస్తున్నారు. నర్సింగ్ విద్యా విభాగాన్ని పర్యవేక్షిస్తున్న అధికారులు మూడేండ్లుగా ఉన్నతాధికారులను తప్పుదోవ పట్టిస్తూ ఉద్యోగోన్నతులు, బదిలీలు, పోస్టింగ్ ల వ్యవహారాలను తమకు అనుకూలంగా నిర్వహిస్తున్నారని ఉద్యోగ సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు.
హైదరాబాద్, జూన్ 3 (నమస్తే తెలంగాణ) : ప్ర మోటీ డిగ్రీ లెక్చరర్స్‌కు కెరీర్ అడ్వాన్స్మెంట్ స్కీమ్ పదోన్నతులకు జూనియర్ లెక్చరర్ల సర్వీసును పరిగణనలోకి తీసుకోవడంపై టీజీసీటీఏ సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్‌గౌడ్, ప్రధాన కార్యదర్శి బ్రిజేశ్ అభ్యం తరం వ్యక్తం చేశారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయి విశ్వవిద్యాలయాలు, డీఆర్డీవో వంటి సైంటిఫిక్ ప్రొఫెసర్ సంస్థల్లో పనిచేసిన సర్వీసును మాత్రమే పరిగణనలోకి తీసుకోవాల్సి ఉండగా, లెక్చరర్‌గా పనిచేసిన కాలాన్ని లెక్కించడంపై ప్రశ్నించారు.