Condoms | హైదరాబాద్, జనవరి 5 (నమస్తే తెలంగాణ): డిసెంబర్ 31న దేశవ్యాప్తంగా న్యూ ఇయర్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఆ రోజు స్విగ్గీ ఇన్‌స్టామార్ట్, బ్లింకిట్, బిగ్ బాస్కెట్ వంటి క్విక్ కామర్స్ వేదికలు కస్టమర్లకు వేగంగా సేవలు అందించాయి. ఆ సేవలపై తాజాగా ఆసక్తికర డాటాను వెల్లడించాయి. వినియోగదారులు ఎక్కువగా ద్రాక్షపండ్లు, కండోమ్స్ ఆర్డర్ చేశారని తెలిపాయి. ఆ రో జు సాయంత్రం 5:30 గంటల వరకే స్విగ్గీ ద్వారా 4,779, అర్ధరాత్రి వరకు 1.2 లక్షల కండోమ్ ప్యాకెట్లను డెలివరీ చేసినట్టు వెల్లడించింది. బ్లింకిట్ డెలివరీ బృందం సాయంత్రం 8 వరకు 2.3 లక్ష ల ఆలూబుజియా, 6,834 ఐస్‌క్యూబ్ ప్యాకెట్లను డెలివరీ చేసింది. బిగ్ బాసె ట్ డెలివరీ చేసిన వాటిలో ఐస్క్యూబ్స్తోపాటు కార్డులు, పార్టీగేమ్స్, హోంబేకింగ్ ఐటమ్స్, సోడా, మాక్టైల్స్ ఉన్నాయి.