హైదరాబాద్, జూలై14 (నమస్తే తెలంగాణ): శంషాబాద్‌లోని ముచ్చింతల్ త్రిదండి చిన్నజీయర్‌స్వామి ఆశ్రమంలో రెండు రోజులుగా కొనసాగుతు న్న వీహెచ్‌పీ న్యాయవాదుల విభాగం మూడో జాతీయ సమావేశాలు ఆదివా రం ముగిశాయి. ప్రభుత్వాల ఆజమాయిషీ నుంచి హిందూ దేవాలయాల తొలగింపు, జనాభా అసమతుల్యత, రి జర్వేషన్లు, మతమార్పిడి తదితరవాటిపై చర్చించి తీర్మానాలు చేశారు. సమావేశంలో వీహెచ్‌పీ కేంద్రీయ అధ్యక్షుడు అలోక్ కుమార్, సహ ప్రధాన కార్యద ర్శి సురేంద్రజైన్, లీగల్‌సెల్ జాతీయ క న్వీనర్ దిలీప్ త్రివేది, జాతీయ కోకన్వీనర్ అభిషేక్, కో కన్వీనర్ శ్రీనివాస్, 150 మంది ప్రతినిధులు పాల్గొన్నారు.
‘మున్నూరుకాపు సంఘాన్ని పటిష్టపరచాలి’
హైదరాబాద్, జూలై 14 (నమస్తే తెలంగాణ): మున్నూరుకాపు సంఘా న్ని గ్రామం నుంచి పటిష్టపరచాలని అ పెక్స్ కౌన్సిల్ తీర్మానం చేసింది. ఆదివారం రాజ్యసభ సభ్యుడు, మున్నూరుకాపుసంఘం గౌరవాధ్యక్షుడు వద్దిరా జు రవిచంద్ర అధ్యక్షతన హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో నిర్ణయం తీ సుకున్నారు. సమావేశంలో కౌన్సిల్ క న్వీనర్ సర్దార్ పుటం పురుషోత్తమరావు, సభ్యులు రౌతు కనకయ్య, సీ విఠల్, బొంతు రామ్మోహన్, ఆకుల రజిత్, నాగేందర్, మరికల్పోత సుధీర్‌కుమార్, విష్ణు జగతి, ఆది విష్ణుమూర్తి, కొత్త లక్ష్మణ్, లవంగాల అనిల్, ఆవుల రామారావు పాల్గొన్నారు.
పాఠశాలలను బలోపేతం చేద్దాం: కోదండరాం
హైదరాబాద్, జూలై 14 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసేందుకు కృషి చేయాలని ప్రొఫెసర్ కోదండరాం ఉపాధ్యాయులకు పిలుపునిచ్చారు. టీచర్ల బదిలీలు, పదోన్నతులతో ప్రభుత్వం పాఠశాలల్లోని అన్ని ఖాళీలను నింపే ప్రయత్నం చేసిందని, ఇక నుంచి బడుల బలోపేతంపై దృష్టిపెట్టాలని సూచించారు. ఆదివారం కాచిగూడలోని ఎస్టీయూ భవన్లో రాష్ట్రస్థాయి కార్యకర్తల శిక్షణా శిబిరానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రభుత్వం మ్యానిఫెస్టోలో పొందుపరిచిన విధంగా సీపీఎస్ విధానాన్ని రద్దు చేయాలని, బదిలీ అయిన టీచర్లను రిలీవ్చేయాలని ఎస్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు ఎం పర్వత్‌రెడ్డి, కార్యదర్శి జీ సదానందంగౌడ్ విజ్ఞప్తిచేశారు.