ఎడపల్లి, జూలై 29: పంట రుణమాఫీ విషయంలో న్యాయం చేయాలని నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం మంగళ్పాడ్కు చెందిన రైతు మాల పెద్దులు జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు విజ్ఞప్తి చేశాడు. సోమవారం గ్రామంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తాను, తన భార్య పేరిట రూ.98 వేల రుణం తీసుకున్నామని, తమకు అది మాఫీ కాలేదని వివరించాడు. దీనిపై ఎడపల్లి సొసైటీ కార్యదర్శి రాజారాం, ఏవో సిద్ది రామేశ్వర్‌ను అడిగితే.. రూ.2 లక్షల కంటే ఎక్కువ రుణం ఉండటంతో మాఫీ కాలేదని చెప్పినట్టు తెలిపారు. మూడు బ్యాంకుల నుంచి రూ.98 వేల రుణమే తీసుకున్నామని తెలుపగా.. అధికారులు ఆన్లైన్లో వివరాలు చెక్ చేశారని పేర్కొన్నాడు. తమ పేరిట గట్క చిన్న సాయిలు రూ.1.20 లక్షల రుణం తీసుకున్నట్టు చూపిస్తున్నదని, అందుకే రుణమాఫీ వర్తించలేదని ఏవో చెప్పారని వివరించాడు.