జనగామ చౌరస్తా, మార్చి 25 : జనగామ కలెక్టర్ వైఖరిపై ఇందిరా మహిళాశక్తి వనిత టీ స్టాల్ నిర్వాహకురాలు పాలమాకుల చిన్న మంజుల బుధవారం ఎస్సీ, ఎస్టీ కమిషన్ రాష్ట్ర చైర్మన్ బక్కి వెంకటయ్యకు బుధవారం హైదరాబాద్‌లో ఫిర్యాదు చేశారు. కలెక్టర్ ఆదేశాల మేరకు మున్సిపల్, రెవెన్యూ, విద్యుత్, ఫుడ్ సేఫ్టీ అధికారులు ఇబ్బంది పెడుతున్న విషయం చైర్మన్‌కు వివరించినట్టు మంజుల తెలిపారు. స్పందించిన ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ వెంకటయ్య.. కలెక్టర్‌కు కమిషన్ తరఫున నోటీసు జారీచేయడంతో పాటు సీఎం రేవంత్‌రెడ్డికి ఫిర్యాదు చేస్తామని చెప్పినట్టు బాధితురాలు పేర్కొన్నారు.