శేరిలింగంపల్లి, ఆగస్టు 30: క్యూ న్యూస్ రిపోర్టర్ తీన్మార్ మల్లన్నపై గచ్చిబౌలి పోలీస్‌స్టేషన్‌లో సిరిసిల్ల జిల్లా గంభీరావుపేటకు చెందిన మాజీ ఎంపీటీసీ కమలాకర్‌రెడ్డి ఫిర్యాదు చేశారు. మంత్రి కేటీఆర్‌పై అసత్య ఆరోపణలు చేస్తూ ఆయన పరువుకు భంగం కలిగేలా వ్యవహరిస్తున్న మల్లన్నపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని కోరారు.
ఇటీవల ఓ దినపత్రికలో ‘గచ్చిబౌలిలో పెట్రేగిపోతున్న కబ్జారాయుళ్లు’ అన్న శీర్షికతో వచ్చిన కథనాన్ని అధారంగా చేసుకొని క్యూ న్యూస్‌లో తీన్మార్ మల్లన్న కబ్జారాయుళ్ల వెనుక మంత్రి కేటీఆర్ ఉన్నాడని నిరాధార ఆరోపణలు చేశారని కమలాకర్‌రెడ్డి పేర్కొన్నారు.