హైదరాబాద్, జూన్ 4 (నమస్తే తెలంగాణ) : అక్రెడిటేషన్లకు సంబంధించి జర్నలిస్టులపై ఇంటెలిజెన్స్ పోలీసులతో విచారణ చేయిస్తున్న జనగామ జిల్లా కలెక్టర్ సందీప్కుమార్ఝౌపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ యూనియన్ ఆఫ్ వరింగ్ జర్నలిస్ట్ సంఘం సమాచారశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డికి విజ్ఞప్తిచేసింది. యూనియన్ ప్రధానకార్యదర్శి ఆసాని మారుతిసాగర్ నేతృత్వంలో పాత్రికేయుల బృందం గురువారం మంత్రిని కలిసింది. ప్రస్తుతం జిల్లాలో 288 మంది జర్నలిస్టులకు అక్రెడిటేషన్లు జారీకాగా.. వారిలో 180 మందిపై ఇంటెలిజెన్స్ అధికారులతో దర్యాప్తు చేయిస్తున్నారని తెలిపారు.
జర్నలిస్టుల వాహనాలను కలెక్టర్ కార్యాలయంలోకి అనుమతించడం లేదని చెప్పారు. స్పందించిన మంత్రి వెంటనే కలెక్టర్‌తో మాట్లాడి సమస్యను పరిషరిస్తామని హామీ ఇచ్చారు. దాంతోపాటు తొమ్మిది పత్రికల విషయంలో మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్‌రెడ్డితో చర్చిస్తామని చెప్పారు. మంత్రిని కలిసినవారిలో టీయూడబ్ల్యూజే కోశాధికారి యోగానందం, హైదరాబాద్ జిల్లా ఇన్చార్జ్ నవీన్‌కుమార్ యారా, ఐజేయూ నాయకులు అవ్వారి భాసర్ తదితరులు ఉన్నారు.