హైదరాబాద్ : తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే పోటీ పరీక్షలకు ఉపయోగపడే పుస్తకాలను డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ అందుబాటులోకి తెచ్చింది. ఈ పుస్తకాలను రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ శనివారం విడుదల చేశారు. 125 మంది ప్రొఫెసర్ల ఆధ్వర్యంలో 4 పుస్తకాలను అందుబాటులోకి తీసుకొచ్చారు. భారతదేశ చరిత్ర – సంస్కృతి, భారతీయ సమాజం – రాజ్యాంగం, పరిపాలన, ఆర్థిక వ్యవస్థ – అభివృద్ధి, తెలంగాణ ఉద్యమం – రాష్ట్ర అవతరణ అనే పుస్తకాలు మార్కెట్లో అందుబాటులో ఉండనున్నాయి. ఈ పుస్తకాలు పోటీ పరీక్షలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని యూనివర్సిటీ అధికారులు వెల్లడించారు.
I am happy to share the good news! Honourable Minister @KTRTRS launched the study material for competitive exams completed by BRAOU under Social Responsibility on No profit Basis. It’s prepared by 125 professors in 4 different subjects matches to @TSPSCofficial syllabus pic.twitter.com/REPN8rizjz
— Prof. Chakrapani Ghanta (@GhantaC) August 27, 2022