Home
Telangana
Comparing The Formation Of Telangana To The Partition Of The Country Is Outrageous Mp Vaddiraju Ravichand
MP Vaddiraju Ravichandra | తెలంగాణ ఏర్పాటు దేశ విభజనతో పోల్చడం దుర్మార్గం : ఎంపీ వద్దిరాజు రవిచంద్ర
MP Vaddiraju Ravichandra | బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య వ్యాఖ్యలను బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును పార్లమెంట్లో బీజేపీ ఎంపీ ( BJP MP ) తేజస్వీ సూర్య దేశ విభజన ( Country Partition ) తో పోల్చడాన్ని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర ( MP Vaddiraju Ravichand ) తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
మహానేత కల్వకుంట్ల చంద్రశేఖర రావు నాయకత్వాన ప్రజలు అహింసా మార్గంలో ఉద్యమించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడం యావత్ ప్రపంచానికి తెలిసిందేనని పేర్కొన్నారు. ఈ వాస్తవాన్ని మర్చిపోయి బీజేపీ ఎంపీ దేశ విభజనతో పోల్చడం దుర్మార్గమన్నారు.
దేశ అత్యున్నత చట్టసభలో కనీస అవగాహన లేకుండా మాట్లాడిన ఆయన తెలంగాణ ప్రజలను అవమానించడమేనని, ఈ వ్యాఖ్యల్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజల ఓట్లతో ఎంపీలుగా ఎన్నికైన తెలంగాణకు చెందిన బీజేపీ,కాంగ్రెస్ ఎంపీలు తీవ్రంగా ఖండించాలని కోరారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

