హైదరాబాద్, జూలై 19 (నమస్తే తెలంగాణ) : ప్రైవేట్ యూనివర్సిటీల్లో ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ త్వరలో తనిఖీలు చేపట్టున్నది. తొమ్మిది అంశాలపై పరిశీలన జరిపి అఫిడవిట్‌ను త్వరలోనే సుప్రీంకోర్టుకు సమర్పించనున్నది.
ఆయేషా జైన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు విచారణలో తమ దృష్టికి వచ్చిన అనేక ఫిర్యాదులను పరిశీలించిన సుప్రీంకోర్టు దేశవ్యాప్తంగా ప్రైవేట్ యూనివర్సిటీల్లో తనిఖీలకు ఆదేశించింది. దీంతో తనిఖీల కోసం కాలేజీయేట్ ఎడ్యుకేషన్ చైర్మన్ అధ్యక్షతన ప్రభుత్వం ఒక కమిటీని నియమించింది.
హైదరాబాద్, జూలై 19 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ కాటన్ మిల్లర్స్ అండ్ ట్రేడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర కార్యవర్గ ఎన్నికలు ఆదివారం హైదరాబాద్‌లో నిర్వహించారు. రాష్ట్ర అధ్యక్షుడిగా బొమ్మినేని రవీందర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శిగా కక్కిరాల రమేశ్, కోశాధికారిగా పడిగెల క్రిష్ణ సంతోష్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు ఆదివారం ఒక ప్రకటనలో ప్రతినిధులు తెలిపారు.